Jammu and Kashmir: జమ్మూలో భారీ ఉగ్రకుట్రకు పాక్ స్కెచ్

Jammu and Kashmir: పాక్‌కు సంబంధించిన డ్రోన్ కూల్చివేత * డ్రోన్‌లో ఐదు కిలోల పేలుడు పదార్థాలు

Update: 2021-07-24 02:23 GMT

జమ్మూ కాశ్మీర్ పోలీసులు గుర్తించిన డ్రోన్ (ఫైల్ ఇమేజ్)

Jammu and Kashmir: భారీ ఉగ్ర కుట్రను జమ్మూ పోలీసులు భగ్నం చేశారు. జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద కనాచక్ ప్రాంతంలో సంచరిస్తోన్న పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్‌ను జమ్మూకశ్మీర్ పోలీసులకు చెందిన క్యూఆర్‌టీ కూల్చివేసింది. అర్దరాత్రి సమయంలో తిరుగున్నట్టు గుర్తించిన డ్రోన్‌ను పోలీసులు నేలమట్టం చేశారు. అందులో కిలోల పేలుడు పదార్ధాలు ఉన్నాయని, కశ్మీర్‌లోని ఉగ్రవాదులకు వాటిని సరఫరా చేసేందుకు డ్రోన్‌ను ప్రయోగించారని అదనపు డీజీపీ ముఖేష్ సింగ్ తెలిపారు. ఒకవేళ డ్రోన్ ఉగ్రవాదులకు చేరి ఉంటే భారీ పేలుళ్ల జరిగేవని, డ్రోన్‌ను కూల్చివేసి పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారని ఆయన పేర్కొన్నారు. చైనా, తైవాన్ లో తయారైన పరికరాలతో ఆ డ్రోన్‌ను తయారు చేశారన్నారు.

Tags:    

Similar News