JIO, Airtel: జియో, ఎయిర్‌టెల్‌ 300లోపు వచ్చే ప్లాన్లు ఇవే.. తేడా ఏంటంటే..?

JIO, Airtel: జియో, ఎయిర్‌టెల్‌ 300లోపు వచ్చే ప్లాన్లు ఇవే.. తేడా ఏంటంటే..?

Update: 2022-02-07 10:30 GMT

JIO, Airtel: జియో, ఎయిర్‌టెల్‌ 300లోపు వచ్చే ప్లాన్లు ఇవే.. తేడా ఏంటంటే..?

JIO, Airtel: టెలికాం కంపెనీల మధ్య నిత్యం పోటీ ఉంటుంది. కస్టమర్లని ఆకర్షించడానికి కొత్త కొత్త ప్లాన్లని ప్రవేశపెడుతుంటారు. డేటా, ఛార్జీల విషయంలో భిన్నమైన ప్రయోజనాలను కల్పిస్తారు. అందుకే యూజర్లు ఏ నెట్‌వర్క్ తక్కువగా ఉంటే అటువైపు మొగ్గు చూపుతారు. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌ల మధ్య పోటీ ఎప్పుడు ఉంటుంది. రెండు కంపెనీలు నిరంతరం కొత్త ప్లాన్‌లను ప్రవేశపెడుతుంటాయి. అయితే 300లోపు ఉన్న ఈ రెండు కంపెనీల ప్లాన్‌ గురించి ఈ రోజు తెలుసుకుందాం.

రిలయన్స్ జియో రూ. 299 ప్లాన్‌ని కలిగి ఉంది. ఇందులో వినియోగదారులు ప్రతిరోజూ 2 GB ఇంటర్నెట్ డేటాను పొందుతారు. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఈ ప్లాన్ కింద వినియోగదారులు అపరిమిత కాలింగ్ పొందుతారు. ఈ ప్లాన్‌లో వినియోగదారులు రోజుకు 100 మెస్సేజ్‌లను ఉచితంగా పొందుతారు. మొత్తం డేటా గురించి మాట్లాడితే వినియోగదారులు 56 GB ఇంటర్నెట్ డేటాను పొందుతారు. అలాగే ఈ ప్లాన్‌లు Jio కాంప్లిమెంటరీ యాప్‌ల యాక్సెస్‌ను పొందుతాయి. అవి JioTV, JioCinema, JioSecurity లాంటివి.

ఎయిర్‌టెల్ రూ. 299 ప్లాన్. ఇందులో రోజువారీ వినియోగదారులు 1.5 GB ఇంటర్నెట్ డేటాను పొందుతారు. వాయిస్ కాలింగ్ కోసం వినియోగదారులకు అపరిమిత కాలింగ్ ఇచ్చారు. ఈ ప్లాన్‌లో రోజుకు 100 SMSల ఆఫర్ ఉంది. ఇతర ప్రయోజనాల గురించి మాట్లాడితే.. ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, వింక్ మ్యూజిక్ ఫ్రీకి ఉచిత యాక్సెస్ ఉంటుంది. ఇది మాత్రమే కాదు ఈ ప్లాన్‌లో ఫాస్టాగ్‌లో రూ.100 క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంది.

Tags:    

Similar News