JEE Mains Examination: జేఈఈ మెయిన్ పరీక్షకు హాజరావుతున్నారా?.. ఇవి తప్పక పాటించాల్సిందే..
JEE Mains Examination: దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుండి 6 వరకు జేఈఈ మెయిన్ పరిక్షలు జరగనున్నాయి.
JEE Mains Examination: దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుండి 6 వరకు జేఈఈ మెయిన్ పరిక్షలు జరగనున్నాయి. కరోనా ప్రభావంతో అధికారులు కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుని పరిక్షలు నిర్వహించనున్నారు. పరిక్షలకు హాజరవుతున్న విద్యార్ధులకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. శరీర ఉష్ణోగ్రత 99.4 డిగ్రీలు దాటిన వారు ఐసొలేషన్ గదిలో పరిక్ష రాయాల్సి ఉంటుంది. ఇక పరిక్షా కేంద్రంలోకి ప్రవేశించిన వెంటనే విద్యార్ధులు సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలని అని అధికారులు తెలిపారు.
ఇక దేశంలోని కరోనా కేసులు చూస్తే గత కొద్ది రోజులుగా పాజిటివ్ కాసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గురువారం భారత్‌లో 69,552 కేసులు నమోదు కాగా, 977 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 58,794 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
దేశంలో మొత్తం 28,36,926 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,86,395 ఉండగా, 20,96,665 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 53,866 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 73.64 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.91 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 24.45 శాతంగా ఉంది. గడచిన 24 గంటల్లో దేశంలో 9,10,470 టెస్టులు జరిగాయి. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 3,26,61,252కి చేరింది.