దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ పరీక్షలు ప్రారంభం
ఇవాల్టినుంచి దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ ఎగ్జామ్స్ ను జరుపుతోంది. నేటినుంచి నుంచి 6 తేదీ వరకు జేఈఈ మెయిన్ ఎగ్జామ్స్ ..
కరోనా నేపథ్యంలో జేఈఈ మెయిన్ పరీక్షలను వాయిదా వేయాలంటూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు.. పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేసినప్పటికీ.. షెడ్యూల్ ప్రకారమే ఈ పరీక్షలు జరపాలని కేంద్ర మానవవనరుల శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా ఇవాల్టినుంచి దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ ఎగ్జామ్స్ ను జరుపుతోంది. నేటినుంచి నుంచి 6 తేదీ వరకు జేఈఈ మెయిన్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఇలా రెండు విడతలుగా పరీక్షలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా 660 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 8 లక్షల 58వేల 273 మంది హాజరుకానున్నారు. విదేశీ విద్యార్ధుల కోసం.. యుఏఈ, సింగపూర్, కువైత్, ఒమన్, నేపాల్, ఖతర్, శ్రీలంకలో 8పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. కాగా ఈ పరీక్షల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఏర్పాట్లు అన్నింటిని పూర్తి చేసింది.
మొదటి రోజు బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ పరీక్ష జరగనుంది, రేపటినుంచి ఈ నెల ఆరవ తేదీ వరకూ బీటెక్, బీఈ ప్రవేశాల కోసం పరీక్షలు నిర్వహించేలా ఎన్‌టీఏ చర్యలు చేపట్టింది. కరోనా నిబంధనలు పాటిస్తూనే పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిచేశామని ఎన్‌టీఏ తెలిపింది. ఇక కరోనా లక్షణాలు ఉండే విద్యార్ధులకు ప్రత్యేక గదిని కేటాయించినట్లు వెల్లడించింది. అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.. లగే హాల్‌టికెట్ తోపాటు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు వంటి గుర్తింపు కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటో కచ్చితంగా వెంట తెచ్చుకోవాలని ఎన్‌టీఏ సూచించింది.