JEE Main 2021 Results: జేఈఈ మెయిన్ 2021 ఫలితాలు విడుదల
JEE Main 2021 Results: జేఈఈ మెయిన్-2021 ఫలితాలను జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) సోమవారం విడుదల చేసింది.
JEE Main 2021 Results: జేఈఈ మెయిన్-2021 ఫలితాలను జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) సోమవారం విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు నాలుగు రోజులపాటు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా మొత్తం 6.61 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 6.20 లక్షల మంది పేపర్-1 రాశారు. తెలుగు రాష్ట్రాల్లో 1.50 లక్షల మంది ఉన్నారు. website: jeemain.nta.nic.in
ఈసారి పరీక్ష రాసిన స్టూడెంట్లకు అడ్మిషన్ సమయంలో వెసులుబాటు కల్పించింది. జేఈఈ మెయిన్ -2021 క్వాలిఫై అయిన స్టూడెంట్లు మార్కులతో సంబంధం లేకుండా క్లాస్ 12 పాసైన సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. కరోనా కారణంగా కేవలం 2021-2022 సంవత్సరానికే ఈ వెసులుబాటు వర్తిస్తుందని తెలిపింది.