Jayalalithaa: స్వాధీనం చేసుకున్న జయలలిత ఆస్తులు మాయం..!

Jayalalithaa: 28 రకాల ఖరీదైన వస్తువులు మాయం

Update: 2023-07-05 05:21 GMT

Jayalalithaa: స్వాధీనం చేసుకున్న జయలలిత ఆస్తులు మాయం..!

Jayalalithaa: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న పలు ఖరీదైన వస్తువులు ఏమయ్యాయో తెలియట్లేదు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న వాటిలో 30 కిలోల బంగారు, వజ్రా భరణాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరో 28 రకాల ఖరీదైన వస్తువులు కన్పించకుండాపోయినట్లు సమాచారం. ఈ విషయాన్ని కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఈ మేరకు ఆయన తమిళనాడు అవినీతి నిరోధక శాఖకు ఓ లేఖ రాశారు. అందులో... జయలలితకు చెందిన ఖరీదైన 11వేల 344 చీరలు, 250 శాలువాలు, 750 జతల పాదరక్షలు, ఖరీదైన గడియారాలు వంటి 28 రకాల పెద్ద మొత్తంలోని వస్తువుల గురించి సమాచారం లేదని పేర్కొన్నారు.

అవి అవినీతి నిరోధక శాఖ ఆధీనంలో ఉంటే వాటిని కర్ణాటక కోర్టులో అప్పగించాలని తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు చెందిన పోయస్ గార్డెన్ ఇంట్లోంచి 1996లో ఈ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీఐ కార్యకర్త నరసింహమూర్తి వ్యాజ్యం అనంతరం బెంగళూరు సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వుల మేరకు వస్తువులను వేలం వేయడానికి కర్ణాటక ప్రభుత్వం తరపున న్యాయవాది నియమితులయ్యారు.

Tags:    

Similar News