కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన నూతన చిత్ర పటాన్ని కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ జమ్మూకశ్మీర్‌లో ఉంటే, గిల్గిత్–బల్టిస్తాన్ లదాఖ్‌లో ప్రాంతంలో ఉంది. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని ముజఫరాబాద్ భారత దేశ సరిహద్దుగా ఉంది. కశ్మీర్‌లో 14 జిల్లాలు ఉండగా, అందులోని లదాఖ్, లేహ్‌లను కేంద్రపాలిత ప్రాంతంలో చేర్చారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 28 జిల్లాలు ఏర్పాటు అయ్యాయి.
జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే అధికరణ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూకశ్మీర్‌కు లదాఖ్‌ల ప్రాంతాలను కేంద్ర పాలితప్రాంతాలుగా చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలె అక్కడ గవర్నర్ పాలన ముగిసింది. గవర్నర్ సత్యపాల్ మాలిక్ ను గోవాకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. జమ్ముకశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా గిరీశ్ చంద్ర ముర్ము, లద్ధాఖ్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా ఆర్‌కే మాథూర్ ప్రమాణస్వీకారం చేశారు.