బాంబుల మోతతో దద్దరిల్లుతున్న జమ్మూకశ్మీర్.. పలు ఉగ్రస్థావరాలను పేల్చేసిన భారత సైనికులు
Jammu and Kashmir: జమ్మూకశ్మీర్ బాంబుల మోతతో దద్దరిల్లిపోతోంది.
Jammu and Kashmir: జమ్మూకశ్మీర్ బాంబుల మోతతో దద్దరిల్లిపోతోంది. గత 12 రోజులుగా ఇండియన్ ఆర్మీ భారీ ఎన్‌కౌంటర్‌ను కొనసాగిస్తోంది. ఉగ్రవాదులను ఏరివేయడమే లక్ష్యంగా భారత ఆర్మీ భారీ వ్యూహంతో ముందుకెళ్తోంది. జమ్మూకశ్మీర్‌లో సామాన్యులను పొట్టనపెట్టుకుంటున్న ఉగ్రమూకల్ని పూర్తిస్థాయిలో మట్టుబెట్టేందుకు ఏకంగా 3వేల మంది సైనికులతో ఆపరేషన్ కొనసాగిస్తోంది. ముఖ్యంగా పూంచ్ సెక్టార్‌లోని మెందహార్, రాజౌరీలోని థాన్మండి అడవుల్లో నిన్న కాల్పులు నెమ్మదించినప్పటికీ ఇవాళ మరోసారి భీకర పోరు కొనసాగుతోంది.
మరోవైపు ఎన్‌కౌంటర్ జరుగుతున్న పూంచ్-రాజౌరీ నేషనల్ హైవేకి కొన్ని కిలోమీటర్ల దూరంలోని భాటా దురియా అడవిలో ఉంది. ఈ అడవిలోనే టెర్రరిస్టులు దాక్కొని భద్రతా దళాలపై దాడులు చేస్తున్నట్టు ఆర్మీ గుర్తించింది. దీంతోతో భద్రతా దళాలు నేషనల్ హైవేని పూర్తిగా మూసివేశాయి. ఇదే సమయంలో దళాల భద్రత దృష్ట్యా ఆపరేషన్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారం బయటకు రానివ్వడం లేదు. ఇప్పటికే ఈ ఆపరేషన్‌లో కొన్ని ఉగ్రస్థావరాలను సైన్యం పేల్చేసింది.