Tamil Nadu: జల్లికట్టు పోటీలు ప్రారంభం.. పోటీల్లో గెలుపొందిన వారికి..
Tamil Nadu: తమిళనాడులో జల్లికట్టు సందడి మొదలైంది.
Tamil Nadu: తమిళనాడులో జల్లికట్టు సందడి మొదలైంది. మదురై అవనీయపురంలో పోటీలు రసవత్తంగా సాగుతున్నాయి. జల్లికట్టులో 5వందల ఎద్దులు, వందల మంది యువకులు పాల్గొంటున్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి కారుని బహుమతిగా ఇవ్వనున్నారు. కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ ఉన్నవారికే అనుమతి ఇస్తున్నారు. 10 వైద్య బృందాల్ని సిద్ధంగా ఉంచారు. గాయపడిన వారికి వెంటనే చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు.
జల్లికట్టుకు తమిళనాడు ప్రభుత్వం సోమవారం నాడు అనుమతిని ఇచ్చింది. జల్లికట్టును ప్రజలు సంప్రదాయబద్దంగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పర్వదినం జరుపుకొనే సమయాల్లో తమిళనాడు రాష్ట్ర ప్రజలు జల్లికట్టు పోటీలను జరుపుకొంటారు. జల్లికట్టుకు అనుమతిస్తూ సోమవారం నాడు సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకొన్నారు. ఈ పోటీల్లో పాల్గొనేవారంతా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాల్సిందేనని ప్రభుత్వం తేల్చి చెప్పింది.