IT Raids: పుష్ప రాజ్‌ అనుకొని.. పీయూష్‌ ఇంటికా?

IT Raids: సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ పుష్పరాజ్‌ అలియాస్‌ పంపీ జైన్‌ నివాసాల్లో ఐటీశాఖ సోదాలు నిర్వహిస్తోంది.

Update: 2021-12-31 13:00 GMT

IT Raids: పుష్ప రాజ్‌ అనుకొని.. పీయూష్‌ ఇంటికా?

IT Raids: సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ పుష్పరాజ్‌ అలియాస్‌ పంపీ జైన్‌ నివాసాల్లో ఐటీశాఖ సోదాలు నిర్వహిస్తోంది. సుమారు 50 ప్రదేశాల్లో తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పుష్పరాజ్‌కు సుగంధ ద్రవ్యాల కంపెనీతోపాటు పెట్రోల్‌ పంపులు, కోల్డ్‌ స్టోరేజ్‌ ఆపరేషన్స్‌ కూడా ఉన్నాయి. కాగా ఇటీవల కాన్పూర్‌కు చెందిన సుగంధ ద్రవ్యాల వ్యాపారి పీయూష్‌ జైన్‌ ఇంట్లోనె జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సోదాల్లో సుమారు 196 కోట్ల నగదు, 23 కేజీల బంగారాన్ని సీజ్‌ చేశారు.

అయితే పీయూష్‌ జైన్‌ కూడా పుష్పరాజ్‌ తరహాలో పర్ఫ్యూమ్‌ వ్యాపారం చేస్తున్నాడు. పుష్పరాజ్‌కు బదులుగా పీయూష్‌ జైన్‌ ఇంట్లో సోదాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇద్దరి పేర్లు ఒకే రకంగా ఉన్న కారణంగా ఐటీ అధికారులు తప్పుగా పీయూష్‌ ఇంట్లో సోదాలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కానీ అక్రమంగా కరెన్సీ దాచిపెట్టిన కేసులో ఇప్పటికే పీయూష్‌ను అరెస్ట్‌ చేశారు. మరో పర్ఫ్యూమ్‌ వ్యాపారి మాలిక్‌ మియాన్‌కు చెందిన ఇండ్లు, ఫ్యాక్టరీల్లో డీసీజీఐ సోదాలు జరుపుతోంది. కన్నౌజ్‌ కోత్వాలి ప్రాంతంలో ఉన్న ఇండ్లల్లో తనిఖీలు జరుగుతున్నాయి.

Tags:    

Similar News