ISRO: GSLV-F10 ప్రయోగానికి ఇస్రో సిద్ధం
* రేపు ఉదయం 5.43 గంటలకు ప్రయోగం * 26గంటల ముందే ప్రారంభమైన కౌంట్ డౌన్ * GSLV మార్క్-2 సిరీస్‌లో GSLV-F10 14వ ప్రయోగం
ISRO: కరోనా కాలంలో ప్రయోగాలను వాయిదా వేస్తూ వచ్చిన ఇస్రో ఇప్పుడు మళ్లీ రంగంలోకి దిగింది. రేపు ఉదయం నెల్లూరు జిల్లా శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రంనుంచి GSLV-F10 ని నింగిలోకి పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రయోగానికి 26 గంటల ముందు కౌంట్ డౌన్ మొదలుపెట్టారు. సన్నాహక ప్రక్రియ పూర్తయ్యాక ప్రీకౌంట్ డౌన్ ప్రారంభించనున్నారు. దేశ రక్షణ వ్యవస్థ, విపత్తుల నిర్వహణకు ఉపకరించే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్–3 అనే ఉపగ్రహాన్ని ఈ ప్రయోగం ద్వారా రోదసిలోకి పంపుతున్నారు.
సుమారు 2,268 కిలోల బరువు కలిగిన ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్‌ను భూస్థిర కక్ష్యలోకి తొలిసారిగా పంపిస్తున్నారు. GSLV మార్క్-2 సిరీస్‌లో ఇది 14వ ప్రయోగం. గతేడాది జనవరిలోనే ఈ ప్రయోగాన్ని నిర్వహించాల్సి ఉండగా సాంకేతిక లోపాల కారణంగా 4 సార్లు వాయిదా పడింది. ఈ ఏడాది కరోనా వల్ల ప్రయోగానికి బ్రేకులు పడ్డాయి. ఇక ఎలాంటి ఆటాంకాలు లేకుండా రేపటి ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. ఈ ఏడాది ఇస్రోకు ఇది రెండో ప్రయోగం కావడం విశేషం.