ISRO: మరో ప్రయోగానికి ఇస్రో రెడీ.. ఐదు చిన్న ఉపగ్రహాలు...

ISRO: పీఎస్‌ఎల్‌వీ సీ-53 ప్రయోగాని ఏర్పాట్లు

Update: 2022-02-28 07:47 GMT

మరో ప్రయోగానికి ఇస్రో రెడీ 

ISRO: మరో ప్రయోగానికి ఇస్రో రెడీ అవుతోంది. ఇటీవల పీఎస్‌ఎల్వీ సీ-52 లాంచన్‌ సక్సెస్ అయింది. అదే ఊపుతో పీఎస్‌ఎల్వీ సీ-53 క్షిపణి ప్రయోగించనున్నారు. ఇస్రో సారథి సోమ్‌నాథ్ ఆధ్వర్యంలో కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్నారు. మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ మొదటి వారంలో పీఎస్‌ఎల్‌వీ సీ-53 ప్రయోగం ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయోగంలో ఈవోఎస్ అనే ఉపగ్రహంతో పాటు మరో ఐదు చిన్న ఉపగ్రహాలను పంపనున్నారు.

ఇక ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ప్రయోగాన్ని మార్చి 15న ప్రయోగాత్మకంగా నిర్వహించనుంది. ఆ తర్వాత మార్చి 25 నుంచి 31 లోపు ఎస్ఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగాన్ని కూడా చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు శాస్త్రవేత్తలు. నానో లాంటి చిన్న శాటిలైట్లను ఒకవైపు ప్రయోగిస్తూనే మరోవైపు ఇస్రో భారీ ప్రాజెక్టులుగా ఉన్న జీఎల్ఎస్‌ఎల్వీ-3 ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది ఇస్రో. 

Tags:    

Similar News