Israel Embassy Blast: ఢిల్లీ పేలుళ్ల వెనుక ఉన్నది వీళ్లే..?
Israel Embassy Blast: ఈ ఏడాది జనవరి 29న ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో కీలక ఆధారాలు నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ సంపాదించింది.
Israel Embassy Blast: ఈ ఏడాది జనవరి 29న ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో కీలక ఆధారాలు నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ సంపాదించింది. పేలుడు పదార్ధాలు పెట్టినట్టుగా భావిస్తున్న ఇద్దరు అనుమానితుల సీసీ ఫుటేజీని రిలీజ్ చేసింది. ఇందులో ఇద్దరు వ్యక్తులు ఇజ్రాయిల్ ఎంబసీ ముందు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. దాంతో బాంబు అమర్చిన వారిగా గుర్తించినట్టు తెలుస్తోంది.
ఇజ్రాయిల్, ఇండియాల మధ్య దౌత్య సంబంధాలు మొదలై 2021 జనవరి 29 నాటికి 29 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అలజడి సృష్టించేందుకు కొందరు ఉగ్రవాదులు ప్రయత్నించారు. ఇజ్రాయిల్‌ను ప్రత్యేక దేశంగా గుర్తింపు ఇవ్వడాన్ని నిరసిస్తూ భారీ పేలుడుకు ప్రణాళిక రూపొందించారు. అయితే గట్టి భద్రత ఉండటంతో వాళ్ల ప్లాన్ వర్కౌట్ కాలేదు. జనవరి 29న ఇజ్రాయిల్ ఎంబసీ పక్కన ఉన్న జిందాల్ హౌజ్ ఎదుట ఉన్న పూల కుండీలో పేలుడు పదార్ధాలు ఉంచారు. ఆ తర్వాత సాయంత్రం సమయంలో పేలుడు జరిగినా పెద్దగా నష్టం జరగలేదు. దీనిపై విచారణ చేపట్టిన ఎన్‌ఐఏ ఇద్దరు అనుమానితులను గుర్తించింది.