AstraZeneca: కోవిషీల్డ్ టీకాతో ప్రమాదం పొంచి ఉందా.. కోవిషీల్డ్ టీకా తీసుకున్నవారి పరిస్థితి ఏమిటి?
Covishield: ఆస్ట్రాజెనికా.. ఇది బ్రిటన్ ఫార్మా కంపెనీ.. ఇప్పుడు ఫార్మా సంస్థపై సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది.
Covishield: ఆస్ట్రాజెనికా.. ఇది బ్రిటన్ ఫార్మా కంపెనీ.. ఇప్పుడు ఫార్మా సంస్థపై సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది. లండన్ కోర్టులో అస్ట్రాజెనికాపై 51 పటిషన్లు నమోదయ్యాయి. ఆ సంస్థ తయారుచేసిన కోవిడ్ టీకాతో బ్లడ్ క్లాట్ అవుతుందని.. దీంతో ప్రాణాలు పోవడం ఖాయమంటూ పలువురు తమ పిటిషన్లలో ఫిర్యాదులు చేశారు. అయితే ఈ వ్యాక్సిన్‌ను భారత్‌లో 80 కోట్ల మందికి రెండు డోసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయమే సోషల్ మీడియాలో చర్చకు తావిచ్చింది. ఇలాంటి ప్రమాదకరమైన వ్యాక్సిన్‌ను భారత్‌లో ఎలా అనుమతించారు? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షాలు ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తున్నాయి. నరేంద్రమోడీ అరెస్ట్ పేరుతో హ్యాష్ ట్యాగ్‌ను తెగ ట్రెండ్ చేస్తున్నారు. నిజంగానే అస్ట్రాజెనికా తయారుచేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌తో ప్రమాదం పొంచి ఉందా? టీకా తీసుకుంటే బ్లాడ్ క్లాట్ అయ్యే ప్రమాదం గురించి ఇప్పుడే జనాలకు తెలిసిందా? కోవిషీల్డ్ టీకాపై నిపుణులు ఏమంటున్నారు? ఆస్ట్రాజెనికా ఎలాంటి వాదనలు చేస్తోంది?
ఔషధాలు, రాజకీయాలు.. ఈ రెండు అంశాలను ఎప్పుడూ మిక్స్ చేయలేము. ఎందుకంటే.. మెడిషన్ అనేది సైన్స్‌తో ముడిపడి ఉంటుంది.. రాజకీయం మాత్రం సెంటిమెంట్, అధికారంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ రెండింటిని తప్పకుండా వేర్వురుగా ఉంచాల్సిందే. దురదృష్టవశాత్తు అలా వేర్వేరుగా ఉంచడం అనేది చెప్పినంత ఈజీ ఏ మాత్రం కాదు. ప్రస్తుతం భారత్‌లో ఇప్పుడు రాజకీయాలు, మెడిషిన్ మిక్స్ అయ్యాయి. అందుకు కారణం కోవిషీల్డ్ వాక్సిన్. ఈ టీకాను బ్రిటిష్ ఫార్మా కంపెనీ అస్ట్రాజెనికా అభివృద్ధి చేసింది. అయితే కోవిషీల్డ్ వ్యాక్సిన్ వివాదం ఏమిటి?.. ఆస్ట్రాజెనికాతో పాట ఆ సంస్థ తయారుచేసిన కోవిషీల్డ్ టీకాపై యునైటెడ్ కింగ్‌డమ్‌లోని 51కి పైగా వ్యాజ్యాలు నమోదయ్యాయి. ఈ వ్యాక్సిన్ లోపభూయిష్టమైనదని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. ఈ టీకా తీసుకుంటే.. తీవ్రమైన దుష్ఫరిణామాలు సంభవిస్తాయని.. కొన్ని సందర్భాల్లో మృతి చెందే ముప్పు కూడా ఉందని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. అయితే ఈ ఫిర్యాదులను ఆస్ట్రాజెనికా మాత్రం తోసి పుచ్చింది. కానీ.. ఒక విషయాన్ని మాత్రం అస్ట్రాజెనికా అంగీకరించింది. చాలా అరుదుగా తమ వ్యాక్సిన్‌తో రక్తం గడ్డ కట్టే అవకాశం ఉందని బ్రిటిష్ ఫార్మా కంపెనీ వెల్లడించింది. ఈ విషయంలోనే ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. బ్లడ్ క్లాట్ అంశాన్ని ఇతర ఫార్మా దిగ్గజ సంస్థలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో భారత ప్రభుత్వాన్ని పలువురు సోషల్ మీడియన్లు ప్రశ్నిస్తున్నారు.
ఆస్ట్రాజెనికాకు చెందిన కోవిషీల్డ్‌ను ఎందుకు అనుమతించారని పలువురు నిలదీస్తున్నారు. ఈ టీకా సమస్యలకు బాధ్యులు ఎవరు? మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఓ హ్యాష్ ట్యాగ్‌ను తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఆ హ్యాష్ ట్యాగ్ నరేంద్రమోడీ అరెస్ట్. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలన్నీ భారీగా ఈ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ టీకా విషయంలో ప్రభుత్వంపై వేలెత్తి చూపుతున్నారు. అయితే ప్రతిపక్షాలు, సోషల్ మీడియన్లు చేస్తున్న ఈ హంగామా నిజంగా అర్థవంతమైనదేనా?... ఈ విషయంలో సైన్స్ ఏం చెబుతోంది?.. ఈ రెండు ప్రశ్నల సమాధానం రాబట్టాలంటే.. మరింత డీప్‌గా వెళ్లాల్సి ఉంటుంది. భారత్‌లో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఆస్ట్రాజెనికా లైసెన్స్ పొందింది. ఈ రెండు కంపెనీలు కలిసి అభివృద్ధి చేసిన టీకాను కోవిషీల్డ్‌గా పిలుస్తారు. అయితే భారత్‌లో ఈ వ్యాక్సిన్‌ను ఎంతమంది తీసుకున్నారు? అన్న అంశంపై క్లారిటీ లేదు. కానీ.. ఇప్పుడు దీనిపై కొన్ని గణాంకాలు అందుబాటులోకి వచ్చాయి. భారత్‌లో మొత్తం 220 కోట్ల డోసులు వినియోగించిట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇందులో 80 శాతం కోవిషీల్డ్ టీకాలు ఉన్నట్టు తెలుస్తోంది. అంటే.. ఆస్ట్రాజెనికాకు చెందిన మొత్తం 176 కోట్ల టీకాలను ప్రజలకు ఇచ్చారన్నమాట. ప్రతి ఒక్కరూ రెండు షాట్లు తీసుకున్నారు. 80 కోట్ల మందికి పైగా భారతీయులు కోవిషీల్డ్ టీకాలను తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ టీకా తీసుకున్న 80 కోట్ల మందికి బ్లాడ్ క్లాట్ సమస్య తప్పదా?... దీనికి నిపుణులు నో అనే సమాధానం చెబుతున్నారు.
అయితే వ్యాక్సిన్ వివాదంలో సోషల్ మీడియా చర్చల్లో నిజాలు మరుగున పడుతున్నాయి. పూర్తిగా రాజకీయాలు వాటిని ప్రమాదకర స్థాయిలో పక్కదోవ పట్టిస్తున్నాయి. సో.. ఈ పుక్కిట పురాణాలను ఒకసారి చూద్దాం.. ఫస్ట్ అఫ్ అల్ బ్లడ్ క్లాట్ అంశాన్ని ఆస్ట్రాజెనికా దాచి పెట్టిందా? అంటే లేదనే చెప్పాలి. కోవిషీల్డ్ ప్యాకేజీపై చూడండి.. చాలా స్పష్టంగా... రక్తం గడ్డ కట్టే ముప్పు ఉందని హెచ్చరించింది. అయితే అది అరుదుగా ఉంటుందని... ప్రతి లక్ష మందిలో ఒకరిద్దరికి రావొచ్చని వెల్లడించింది. అంటే.. బ్లడ్ క్లాట్ విషయాన్ని ఆస్ట్రాజెనికా ముందే చెప్పిందన్నమాట. అంతేకాదు.. ఈ సమాచారాన్ని కూడా ప్లబిక్ డొమైన్‌లో ఉంచింది. ఇక బ్లడ్ క్లాట్ అనేది ప్రమాదకరంగా మారుతుందా?.. మళ్లీ మనం గణాంకాలను పరిశీలించాల్సిందే. యూకేలో 2022లో ఓ అధ్యయనం జరిగింది. 4 కోట్ల 60 లక్షల మంది పెద్దలపై కోవిషీల్డ్ ప్రభావాన్ని పరిశీలించారు. అయితే బ్లడ్ క్లాట్‌తో ప్రమాదం చాలా తక్కువని తేలింది. 10 లక్షల మందిలో ముగ్గురిపై ప్రభావం చూపినట్టు తెలుస్తోంది. నిజానికి వ్యాక్సిన్ కంటే.. కోవిడ్ వైరస్ మరింత ప్రమాదకరమైనది. రక్తాన్ని ఈ వైరస్సే గడ్డ కట్టేలా చేస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. అంతేతప్ప.. వ్యాక్సిన్‌తో ఊహించినంత ప్రమాదం ఉండదని చెబుతున్నారు. అంటే.. ప్రమాదం కంటే.. ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని వివరిస్తున్నారు. కానీ.. కొందరు పనిగట్టుకుని.. కోవిషీల్డ్ టీకాను దీన్ని కాంట్రవర్సీగా మారుస్తున్నారు. కోవిడ్ వాక్సిన్ క్రెడిట్‌ను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
కానీ.. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే.. అన్ని వ్యాక్సిన్లలో ఇలాంటి రిస్క్‌లే ఉంటున్నాయి. ఇన్‌ఫ్ల్యూయెంజా వ్యాక్సిన్, హెచ్1ఎన్1, రేబీస్ వంటి అన్ని టీకాలకు బ్లడ్ క్లాట్‌తో లింక్ ఉంటుంది. అలా అని వాటిని తీసుకోవడం మానేయాలా? అంటే.. భయపడాల్సిన పని లేదని నిపుణులు సింపుల్‌గా చెబుతున్నారు. చాలా వరకు ఏ వ్యాక్సిన్ తయారుదారైనా.. తమ టీకా 100 శాతం కచ్చితమైనదని ఎంత మాత్రం ప్రకటించలేరు. సింపుల్‌గా చెప్పాలంటే.. వైరస్‌పై టీకా 100 పర్సెంట్ ప్రభావవంతంగా పని చేయదు. అందులో కొన్ని సైడ్ ఎఫెక్ట్‌లు ఉంటాయని తప్పకుండా చెబుతాయి. నిజానికి ప్రభుత్వాలు కూడా వ్యాక్సిన్ల విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోవు. డాక్టర్లు, సైంటిస్ట్‌ల అభిప్రయాలను తీసుకున్న తరువాతనే.. ఆయా టీకాలకు అనుమతి మంజూరు చేస్తాయి. భారత్ కూడా ఇలాంటి పద్దతినే అనుసరించింది. దేశంలో ఎలాంటి వ్యాక్సిన్‌కు అయినా.. సీడీఎస్‌సీవో అనుమతులు మంజూరు చేస్తుంది. సీడీఎస్‌సీవో అంటే.. ది సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్. టీకా గురించి వాస్తవాలను ఈ సంస్థనే తెలుసుకుంటుంది. ఇప్పుడు ఆస్ట్రాజెనికా విషయానికి వద్దాం.. ఈ సంస్థ తయారుచేసిన కోవిషీల్డ్ వాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్‌లు ఉన్న మాట వాస్తవం. అవి కూడా ప్రమాదకరమైనవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ ముప్పును ఆస్ట్రాజెనికా దాచేసిన విషయం అస్సలు కాదు. కానీ.. టీకా నుంచి వచ్చే ప్రమాదం కంటే.. కోవిడ్ నుంచి వచ్చే ప్రమాదమే తీవ్రమైనది.
నిజానికి ఫార్మా కంపెనీలు సైడ్ ఎఫెక్ట్‌ల గురించి చాలా తక్కువగా మాట్లాడుతాయి. కానీ.. ప్రభుత్వాలు వాటిపై అవగాహన చేపట్టవచ్చు. అయితే ఇవన్నీ ఇప్పుడు చెప్పడం సులభమే. కానీ.. కోవిడ్ సమయంలో పరిస్థితులు చాలా ఘోరంగా ఉండేవి. నిత్యం వేలాది మంది చనిపోయారు. వేలాది మంది వైరస్ బారిన పడి విలవిలలాడారు. అప్పట్లో వైరస్ నుంచి ప్రజల ప్రాణాలను రక్షించడమే ప్రథమ కర్తవ్యం. మిగతావన్నీ సెంకడరీ. అయితే ప్రజల కోసమే ఆయా ఫార్మా కంపెనీలు కష్టపడి.. తయారుచేశాయని చెప్పడం కూడా సరికాదు. నిజానికి ఆయా ఫార్మా కంపెనీలన్నీ డబ్బు కోసమే వ్యాక్సిన్లను తయారుచేశాయి. ఉదాహరణకు ఫైజర్‌ను తీసుకోండి. ఈ సంస్థ 2022లో 10వేల కోట్లడాలర్లకు పైగా ఆదాయాన్ని అర్జించింది. ఇందులో 5వేల 700 కోట్ల డాలర్లు కేవలం ఒక్క కోవిడ్ ఔషధాల నుంచే ఆ కంపెనీకి వచ్చాయి. ఆ తరువాత.. టీకాలు, యాంటీ వైరల్స్ ఉండనే ఉన్నాయి. కోవిడ్ టీకా రాకముందు ఫైజర్ ఆదాయాన్ని చూడండి.. కేవలం 5వేల 700 కోట్ల డాలర్ల కంటే తక్కువగా నమోదయ్యింది. కాబట్టి.. ఈ మహమ్మారి సమయంలో ఫార్మా కంపెనీలు అత్యధిక లాభాలను పొందాయి. ఇతర టాప్ ఫార్మా కంపెనీలు సుమారు 9వేల కోట్ల డాలర్లకు పైగా అర్జించాయి. ఒక్క ఫైజర్ మాత్రమే 5వేల 700 కోట్ల డాలర్ల టీకాలను విక్రయించింది. 2వేల కోట్ల డాలర్ల చొప్పున బయోటెక్, మొడన్నా లాభాలను పొందాయి. ఇక చైనాకు చెందిన సినోవాక్స్ 15వందల కోట్ల డాలర్లను సంపాదించింది.
అయితే టీకాలతో ఆకస్మికంగా ఫార్మా కంపెనీలు పొందిన లాభాలను ప్రజలు ప్రశ్నించవచ్చు. లేదంటే.. వాక్సిన్లను ఎందుకు ఎక్కువ దరలకు విక్రయించారని నిలదీయవచ్చు. కానీ.. సైడ్ ఫెక్ట్‌ల గురించి ప్రమాదకరమైన, విడ్డూరమైన వాదనలు చేయడం సరికాదు. ముఖ్యంగా సరైన వివరాలను తెలుసుకోకుండా ఇలాంటి వాదనలు చేసి.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే అవుతుంది తప్ప.. ఎలాంటి ఉపయోగం ఉండదు. ఘోరమైన మూడు సంవత్సరాలు, లక్షల మంది తరువాత.. మనం ఇప్పుడు ఇలా ఉన్నామంటే.. ఆ టీకాలే కారణమన్న విషయం తెలుసుకోవాలి.