ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్.. నిజమెంత ?

Update: 2020-11-18 10:48 GMT

ఢిల్లీలో మళ్లీ లాక్‌డౌన్‌కు రంగం సిద్ధం అవుతుందా ? కేంద్రానికి రాసిన లేఖలో సీఎం కేజ్రీవాల్ ఏం కోరారు. మళ్లీ తాళాలు పడడం ఖాయమా ? అసలు ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉందిప్పుడు ?

వాల్డ్‌వైడ్‌గా కరోనా వైరస్ సెకండ్‌ వేవ్‌ కలవరపెడుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో రెండో విడత లాక్‌డౌన్‌ విధించగా మరికొన్ని దేశాలు పాక్షిక ఆంక్షలు పెడుతున్నాయ్. బ్రిటన్‌, ఫ్రాన్స్‌, అమెరికాలో కొత్త కేసులు భారీగా నమోదవుతుండడం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మొన్నటివరకు అదుపులోకి వచ్చిందనుకున్న మహ్మమారి రాజధాని ఢిల్లీని వణికిస్తోంది. తాజాగా అక్కడ నమోదవుతున్న కేసులు ప్రభుత్వాలను కలవరపెడుతున్నాయి.

వారంరోజులుగా డెయిలీ 4వేలకు పైగా పాజటివ్‌ కేసులు వెలుగుచూస్తున్నాయ్. మృతుల సంఖ్య కూడా పెరగడం టెన్షన్ పుట్టిస్తోంది. దీపావళి పండగ సీజన్, చలికాలం రావటంతో బాధితుల సంఖ్య రోజురోజుకి రెట్టింపు అవుతోంది. మరికొన్నాళ్లపాటు పరిస్థితి ఇలానే కొనసాగితే మరోసారి లాక్‌డౌన్‌ విధించాలన్న ఆలోచనలో ఉన్నారు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌. కేంద్ర అనుమతి ఇస్తే హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధిస్తామని ప్రకటించారు.

మంగళవారం వైద్యారోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన కేజ్రీవాల్‌ పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. పాక్షికంగా లాక్డౌన్ విధించే ఆలోచనలో ఉన్నామని కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరుతామని కేజ్రీ తెలిపారు. వైరస్ హాట్‌స్పాట్లుగా మారుతున్న మార్కెట్లను మూసివేయాలని, పెళ్లిళ్లు ఇతరత్రా వేడుకల్లో సభ్యుల పరిమితిని కుదించాలని ఢిల్లీ సర్కార్ భావిస్తోంది. దీనికి సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేఖ రాశామని అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని కేజ్రీవాల్ చెప్పారు. 

Tags:    

Similar News