రైతుల ఆందోళనల సెగ రిపబ్లిక్ డే ఉత్సవాలకు తగలనుందా?
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీల రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయ్. మూడు చట్టాలు రద్దు చేసే వరకు నిరసనలు ఆపేది లేదంటున్న అన్నదాతలు.. బ్రిటీష్ ఎంపీలకు లేఖ రాసేందుకు సిద్ధమయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు బోరిస్ జాన్సన్ రావొద్దని విజ్ఞప్తి చేసే అవకాశాలు ఉన్నాయ్.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీల రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయ్. మూడు చట్టాలు రద్దు చేసే వరకు నిరసనలు ఆపేది లేదంటున్న అన్నదాతలు.. బ్రిటీష్ ఎంపీలకు లేఖ రాసేందుకు సిద్ధమయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు బోరిస్ జాన్సన్ రావొద్దని విజ్ఞప్తి చేసే అవకాశాలు ఉన్నాయ్.
కేంద్రవ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు.. కొనసాగుతున్నాయ్. మూడు చట్టాలను రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగడని.. పట్టిన పట్టు వీడడం లేదు అన్నదాతలు ! ఐతే చట్టాలు రద్దు చేయడం కుదరదని.. సవరణకు ఓకే అని కేంద్రం చెప్తోంది. దీంతో ప్రతిష్టంభన వీడడం లేదు. ఇప్పటికే రైతులకు, కేంద్రానికి మధ్య పలుమార్లు చర్చలు జరిగాయ్. అయినా ఫలితం లేకుండా పోయింది. సవరణ ప్రతిపాదనలను కేంద్రం పంపినా... రైతు సంఘాల నేతలు దాన్ని తిరస్కరించారు. చట్టాలు రద్దు చేయాల్సిందేనని.. ఆరు నెలలయినా సరే ఆందోళనలు కొనసాగిస్తామని చెప్తున్నారు.
రైతుల ఆందోళనకు సంబంధించి సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుంది. ఐతే సూచనలు, సలహాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని.. ఆందోళనలు వీడాలని కేంద్రం ఎన్నిసార్లు చెప్పినా.. రైతులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇలాంటి సమయంలో ప్రధాని మోడీ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కొత్త చట్టాల వల్ల రైతులకు ఎలాంటి నష్టం ఉండబోదని.. కావాలని ప్రతిపక్షాలు వారిని తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. ఇలాంటి సమయంలో ఆందోళనలు మరింత ఉద్ధృతం చేసేందుకు అన్నదాతలు సిద్ధం అవుతున్నారు.
జనవరి 26 ఎర్రకోట దగ్గర జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు.. ఈసారి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అతిధిగా హాజరుకాబోతున్నారు. ఐతే బ్రిటిష్ ఎంపీలకు లేఖలు రాయాలని రైతులు నిర్ణయించుకున్నారు. బోరిస్ జాన్సన్ రావొద్దంటూ విజ్ఞప్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. తమ ఆందోళనకు మద్దతు తెలపాలని వారు కోరే అవకాశాలు ఉన్నాయ్. ఇక అటు రైతులకు కేంద్రం మరోసారి లేఖ రాయగా.. బుధవారం దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నదాతలు చెప్తున్నారు. ఆ లేఖలో కొత్త అంశాలేవీ లేవని వారు అంటున్నారు.