ఢిల్లీ పేలుడు ఘటనలో దర్యాప్తు ముమ్మరం

* ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించిన ఫోరెన్సిక్ టీమ్ * స్పాట్‌లో ఎన్వలప్‌ స్వాధీనం చేసుకున్న అధికారులు * ఎన్వలప్‌లో ఇజ్రాయెల్ ఎంబసీ అధికారుల వివరాలు

Update: 2021-01-30 06:25 GMT

Representational Image

ఢిల్లీ పేలుడు ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేశాయి ఇన్వెస్టిగేషన్ టీమ్స్. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ టీమ్ బాంబ్ బ్లాస్ట్ జరిగిన చోట కీలక ఆధారాలు సేకరించింది. స్పాట్‌లో ఎన్వలప్‌ స్వాధీనం చేసుకున్నాయి ఫోరెన్సిక్ టీమ్స్. అయితే అందులో ఇజ్రాయెల్ ఎంబసీ అధికారులకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్వలప్‌లోని లేఖలో ఇది ట్రయలర్ మాత్రమే అని రాసినట్లు గుర్తించారు. దీంతో భారీ పేలుడుకు కుట్ర జరిపారని భావిస్తున్నారు పోలీసులు. దీని వెనక ఇరాన్ ఉగ్రవాదుల హస్తం ఉందని అనుమానిస్తున్నారు.

ఇక బాంబు పేలిన చోట సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు పోలీసులు. అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు క్యాబ్‌లో వచ్చి దిగినట్లు గుర్తించారు. అయితే ఆ ఇద్దరికీ పేలుడుకు సంబంధం ఉందని అనుమానిస్తున్న పోలీసులు క్యాబ్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరోవైపు పేలుడుతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, ముఖ్య పట్టణాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ముంబయిలోని ప్రధాన ప్రాంతాల్లో భద్రత పెంచారు. విమానాశ్రయాలకు, అణు, ఏరోస్పేస్ సంస్థలకు హై అలర్ట్ ప్రకటించారు. 

Full View


Tags:    

Similar News