రోజుకు రూ.416 పొదుపు చేస్తే చాలు.. చివరకు 65 లక్షలు మీవే..

రోజుకు రూ.416 పొదుపు చేస్తే చాలు.. చివరకు 65 లక్షలు మీవే..

Update: 2022-03-08 03:30 GMT

రోజుకు రూ.416 పొదుపు చేస్తే చాలు.. చివరకు 65 లక్షలు మీవే..

SSY Benefits: మీరు ఒక కుమార్తెకు తండ్రి అయితే మహిళా దినోత్సవం రోజున ఆమెకి ఏదైనా బహుమతి ఇవ్వండి. భవిష్యత్‌లో ఎప్పుడూ డబ్బు సమస్య రాకుండా ఉండేందుకు ఈ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టండి. సుకన్య సమృద్ధి యోజనలో రోజుకు రూ. 416 ఆదా చేయడం ద్వారా మీ కుమార్తె కోసం 65 లక్షల భారీ నిధిని సంపాదించవచ్చు. సుకన్య సమృద్ధి యోజన అనేది దీర్ఘకాలిక పథకం. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మీ కుమార్తె విద్య, భవిష్యత్తు గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. దీని కోసం మీరు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మీ కుమార్తెకు 21 ఏళ్లు వచ్చేసరికి ఆమెకు ఎంత డబ్బు అవసరమో ముందుగా నిర్ణయించుకోండి. దాని ప్రకారం రోజుకి కొంత పొదుపు చేస్త చాలు.

ఆడపిల్లల భవిష్యత్తును మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చేపడుతున్న అతి ముఖ్యమైన పథకం ఇది. సుకన్య సమృద్ధి యోజనలో 10 సంవత్సరాల వరకు ఉన్న కుమార్తె పేరుపై ఖాతాను ఓపెన్‌ చేయవచ్చు. ఇందులో ఏటా కనిష్టంగా రూ.250 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. కుమార్తెకు 21 ఏళ్లు వచ్చేసరికి ఈ పథకం మెచ్యూర్ అవుతుంది. అయితే ఈ పథకంలో మీ పెట్టుబడి కుమార్తెకు 18 ఏళ్లు వచ్చే వరకు లాక్ చేయబడి ఉంటుంది. 18 సంవత్సరాల తర్వాత ఆమె ఈ పథకం నుంచి మొత్తంలో 50% విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆమె గ్రాడ్యుయేషన్ లేదా తదుపరి చదువుల కోసం దీనిని ఉపయోగించవచ్చు. దీని తర్వాత ఆమెకు 21 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు మాత్రమే మొత్తం డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.

2022లో మీ కుమార్తెకు 1 సంవత్సరం వయస్సు ఉంటే మీరు పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే అది 2042లో మెచ్యూర్ అవుతుంది. మీరు ఈ పథకం గరిష్ట ప్రయోజనాన్ని పొందవచ్చు. మీరు 2022లో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే మీ కుమార్తె వయస్సు 1 సంవత్సరం అని అనుకుందాం. ఇప్పుడు మీరు రోజుకు రూ. 416, ఆ తర్వాత నెలలో రూ. 12,500 ఆదా చేశారు. మీరు ప్రతి నెలా రూ.12,500 డిపాజిట్ చేస్తే సంవత్సరంలో రూ.15,00,00 అవుతుంది. మీరు ఈ పెట్టుబడిని 15 సంవత్సరాలు చేస్తే అప్పుడు మొత్తం పెట్టుబడి రూ. 2,250,000 అవుతుంది. సంవత్సరానికి 7.6 శాతం వడ్డీతో మొత్తం వడ్డీ రూ. 4,250,000 అవుతుంది. 2042లో కుమార్తెకు 21 ఏళ్లు నిండినప్పుడు పథకం మెచ్యూర్ అవుతుంది. ఆ సమయంలో మొత్తం మెచ్యూరిటీ రూ. 6,500,000 అవుతుంది. 

Tags:    

Similar News