Pension: వీటిలో పెట్టుబడి పెడితే చాలు.. నెల నెలా పెన్షన్..!
Pension: వీటిలో పెట్టుబడి పెడితే చాలు.. నెల నెలా పెన్షన్..!
Pension: ఖర్చులు వేగంగా పెరుగుతున్న నేటి కాలంలో సంపాదన మాత్రం వేగంగా పెరగడం లేదు. ఈ పరిస్థితిలో మీరు జీవితంలోని చివరి దశకు చేరుకున్నప్పుడు అంటే ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ తర్వాత ఖర్చులకోసం ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సిందే. ఎందుకంటే వృద్ధాప్యంలో అతిపెద్ద ఖర్చు వైద్య అవసరాలు. ఒకవేళ మీరు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటే అప్పటికి డబ్బుకోసం చింతించనవసరం ఉండదు. మీ ఖర్చులు హాయిగా తీర్చుకునేలా నెలవారీ ఆదాయాన్ని పొందవచ్చు. అందుకోసం పెన్షన్ సౌకర్యం ఉండే ఈ ప్రభుత్వ పథకాలలో పెట్టుబడి పెట్టడం మంచిది.
ప్రధాన మంత్రి వయ వందన యోజన
మీరు దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) నుంచి ప్రధాన మంత్రి వయ వందన యోజన (PMVVY)ని కొనుగోలు చేయవచ్చు. ఇది మీకు 10 సంవత్సరాలకు స్థిరమైన పెన్షన్ రేటును అందిస్తుంది. ఇది రిటైర్మెంట్ చేసిన వారికి చాలా మంచి పథకం. 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా ఈ పథకంలో చేరవచ్చు. ఈ పథకంలో వడ్డీ ప్రస్తుతం సంవత్సరానికి 7.4% అందుబాటులో ఉంది. ఇది ప్రతి నెలా చెల్లిస్తారు. దీని రేట్లు ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి. కానీ ఒకసారి పెట్టుబడి పెడితే మొత్తం పెట్టుబడి కాలానికి రేట్లు నిర్ణయిస్తారు. మరణ ప్రయోజనం కూడా ఉంటుంది. పాలసీదారు మరణించిన తర్వాత కొనుగోలు ధర డబ్బు నామినీకి తిరిగి ఇస్తారు.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఈ పథకం సీనియర్ సిటిజన్‌లను దృష్టిలో ఉంచుకుని ప్రారంభించారు. ప్రస్తుతం త్రైమాసిక ప్రాతిపదికన ఈ పథకంపై 7.4% వడ్డీ అందుబాటులో ఉంది. ఇందులో పెట్టుబడి పెట్టినా సాధారణంగా 5 సంవత్సరాలలో మెచ్యూర్ అవుతుంది. మీకు కావాలంటే దానిని మరో 3 సంవత్సరాల పాటు పొడిగించుకోవచ్చు.
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అనేది ప్రభుత్వ చిన్న పొదుపు పథకం. ఇది పెట్టుబడిదారులకు ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని సంపాదించడానికి అవకాశం ఇస్తుంది. ఈ పథకం కింద సింగిల్ లేదా జాయింట్ ఖాతా తెరవవచ్చు. దీనిపై ప్రభుత్వం 6.6% వార్షిక వడ్డీని ఇస్తుంది. ఈ పథకం 5 సంవత్సరాలు ఉంటుంది. కావాలంటే మరో 5 సంవత్సరాలు పొడగించుకోవచ్చు. ఒక ఖాతా ద్వారాగరిష్ఠంగా రూ.4.5 లక్షలు.. జాయింట్ ఖాతా ఉన్నట్లయితే గరిష్టంగా రూ.9 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.