Red Corner Notice: మనీలాండరింగ్ కేసుల్లో నీరవ్ మోడీ భార్యపై రెడ్ కార్నర్ నోటీసు

Red Corner Notice: పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ భార్య అమీ మోడీపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది.

Update: 2020-08-25 09:29 GMT

Nirav Modi (File photo)

Red Corner Notice: పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ భార్య అమీ మోడీపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. భారతదేశంలో ఆమెపై నమోదైన మనీలాండరింగ్ కేసులకు సంబంధించి నోటీసు జారీ చేశారు. రెడ్ కార్నర్ నోటీసు అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్‌గా పనిచేస్తుంది మరియు అప్పగించే ప్రక్రియను ప్రారంభిస్తుంది.నీరవ్ మోడీ, అతని సోదరుడు నేహల్ (బెల్జియం పౌరుడు), సోదరి పూర్వికి వ్యతిరేకంగా ఇలాంటి నోటీసులు ఇప్పటికే ఇవ్వబడ్డ విషయం తెలిసిందే.

గత ఏడాది లండన్‌లో అరెస్ట అయిన నీరవ్ మోడీను భారత్‌కు అప్పగించాలని కోరుతున్నారు.. ప్రస్తుతం ఆయన లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉన్నాడు. అలాగే, అతని మామ, మరో నిందితుడు అయిన మెహుల్ చోక్సీ ఇప్పుడు కరేబియన్ ద్వీపం ఆంటిగ్వాలో నివసిస్తున్నాడు. అతడు అక్కడ పౌరసత్వం కలిగి ఉన్నాడు. భారతదేశానికి తిరిగి రాకపోవడానికి ఆరోగ్య కారణాలను ఆయన ఉదహరించాడని సమాచారం.

నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ ఇద్దరూ విదేశీ రుణాలు పొందటానికి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పిఎన్‌బి పేరిట నకిలీ హామీలతో కూడిన కుంభకోణంలో నిందితులు. మే నెలలో దాఖలు చేసిన చార్జిషీట్‌లో 6,498.20 కోట్ల రూపాయల ఫండ్స్ ను నీరవ్ మోడీ స్వాధీనం చేసుకున్నట్లు సిబిఐ ఆరోపించింది. మరో 7,080.86 కోట్లు మెహుల్ చోక్సీ చేత మోసం చేయబడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

సిబిఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) తన విచారణను ప్రారంభించడానికి ముందు ఇద్దరూ 2018 లో భారతదేశం నుండి పారిపోయారు. గత నెలలో మనీలాండరింగ్ని రోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద నీరవ్ మోదీపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. వ్యాపారవేత్తకు చెందిన 330 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. వీటిలో ముంబై, లండన్ మరియు యుఎఇలలో ఫ్లాట్లు ఉన్నట్లు సమాచారం. సిబిఐ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్లో నేహాల్ మోడీ పేరు కూడా ఉంది.


Tags:    

Similar News