PM Modi: ఎంపీలతో కలిసి పార్లమెంట్ క్యాంటీన్‌లో మోదీ లంచ్
PM Modi: సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
PM Modi: పార్లమెంట్ ప్రాంగణంలో అనూహ్య దృశ్యం కనిపించింది. పార్టీలకు అతీతంగా కొంతమంది ఎంపీలతో కలిసి ప్రధాని మోడీ పార్లమెంట్ క్యాంటీన్‌లో భోజనం చేశారు. బీజేపీతో సహా పలు పార్టీలకు చెందిన 8మంది ఎంపీలకు ప్రధాని లంచ్‌కు ఆహ్వానించారు. బీజేపీ ఎంపీలు హీనాగవిత్, ఎల్.మురుగన్, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, బీఎస్పీ ఎంపీ రితేశ్ పాండే తదితరులు ప్రధానితో కలిసి భోజనం చేశారు.
దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగిన లంచ్ భేటీలో పలు అంశాలపై ముచ్చటించారు. విదేశీ పర్యటలు, వ్యక్తిగత విషయాలను మోడీ పంచుకున్నట్లు తెలిసింది. తనతో పాటు ఎంపీల భోజనానికి అయిన ఖర్చును ప్రధానే చెల్లించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.