IndiGo slashes salaries: సీనియర్ ఉద్యోగులకు భారీగా వేతన కోతలు
IndiGo slashes salaries: కరోనావైరస్ మహమ్మారి కారణంగా సంక్షోభాన్ని తగ్గించడానికి ఇండిగో తన సీనియర్ ఉద్యోగులకు 35 శాతం వరకు వేతన కోతలను అమలు చేస్తున్నట్లు సోమవారం తెలిపింది.
IndiGo slashes salaries: కరోనావైరస్ మహమ్మారి కారణంగా సంక్షోభాన్ని తగ్గించడానికి ఇండిగో తన సీనియర్ ఉద్యోగులకు 35 శాతం వరకు వేతన కోతలను అమలు చేస్తున్నట్లు సోమవారం తెలిపింది. మే నుండి ఇండిగో తన సీనియర్ ఉద్యోగులకు 25 శాతం వరకు వేతన కోతలను అమలు చేసింది. మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా జూలై 20 న ఎయిర్లైన్స్ తన ఉద్యోగులలో 10 శాతం మందిని తొలగిస్తామని ప్రకటించిన తరువాత 35 శాతం కోత నిర్ణయం వెలువడింది. దీనిపై ఇండిగో సీఈఓ రోనోజోయ్ దత్తా సోమవారం ఇ-మెయిల్ ద్వారా ఉద్యోగులకు ఈ విషయాన్నీ తెలిపారు. అందులో ఇలా పేర్కొన్నారు.
నా జీతాన్ని 35 శాతం తగ్గించుకుంటున్నాను. అలాగే అందరూ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు 30 శాతం వేతన కోత తీసుకోవాలని అడుగుతున్నాను అన్నారు. ఇక పైలట్లు వారి పే కట్ ను 28 శాతానికి పెంచామని అన్నారు , ఇక ఉపాధ్యక్షులకు 25 శాతం వేతన కోత ఉంటుందని. అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్లకు 15 శాతం వేతన కోత ఉండనుందని అన్నారు. ఈ వేతన కోతలు సెప్టెంబర్ 1 నుండి అమల్లోకి వస్తాయని ఆయన అన్నారు.