India's First Antigen Kit: తొలి స్వదేశీ కరోనా కిట్‌కు ఐసీఎంఆర్ గ్రీన్ సిగ్నల్
India's First Antigen Kit: భారత్‌లో రూపొందించిన తొలి యాంటీజెన్ టెస్ట్ కిట్ కు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆమోదముద్రవేసింది.
India's First Antigen Kit: భారత్‌లో రూపొందించిన తొలి కరోనా టెస్ట్ కిట్ కు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆమోదముద్రవేసింది. ప్యాథోక్యాచ్ కొవిడ్–19 యాంటీజెన్ టెస్టింగ్ కిట్‌గా పిలిచే కిట్ ను మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ అభివృద్ధి చేసింది. దీంతో ఇండియాలో రూపొందించిన తొలి యాంటీజెన్ టెస్ట్ కిట్ ఇదే కానుంది. దీనిని వెంటనే మార్కెట్‌లో అందుబాటులోకి తెనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఈ కిట్ ధరను రూ. 450గా నిర్ణయించనున్నట్టు తెలుస్తుంది.
ఈ సందర్భంగా మైలాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ హస్‌ముఖ్ రావల్ మాట్లాడుతూ..'కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి మైల్యాబ్ టీమ్ ఎంతగానే కృషి చేస్తుంది. విదేశీ కిట్స్ మీద ఆధారపడొద్దనే ఉద్దేశంతో ఆర్‌టీ–పీసీఆర్ కిట్‌లు రూపొందించాం. తర్వాత కరోనా టెస్టింగ్స్‌ను పెంచడానికి కాంప్యాక్ట్ ఎక్స్‌ఎల్‌ను లాంచ్ చేశాం. ఇప్పుడు యాంటీజెన్ టెస్టింగ్ కిట్‌కు ఆమోదం అందడంతో కరోనాపై పోరులో టెస్టింగ్‌ను భారీగా పెంచనున్నాం' అని తెలిపారు. అలాగే అందుబాటు ధరలకు ఆర్‌సీ-పీసీఆర్ పరీక్షలను తీసుకురావడం ద్వారా తాము విదేశీ వస్తు సామగ్రిపై ఆధారపడటాన్ని తగ్గించామన్నారు. మైల్యాబ్ యాంటీజెన్ కిట్ కంటే ముందు సౌత్ కొరియాకు చెందిన ఎస్‌డీ బయోసెన్సార్ తయారు చేసిన టెస్ట్ కిట్స్‌కు ఐసీఎంఆర్ ఆమోదం తెలిపింది.