దేశీ స్టాక్ మార్కెట్లు మరోమారు లాభాల బాట..
* తొలి సెషన్ లో సరికొత్త రికార్డులతో లాభాలు.. * మలి సెషన్ లోనూ అదే ధోరణిన దేశీ మార్కెట్లు .. * యూఎస్ మార్కెట్ల లాభాల ముగింపు నేపధ్యం.
దేశీ స్టాక్ మార్కెట్లు మరోమారు లాభాల బాట పట్టాయి. తాజా వారం తొలి సెషన్ లో సరికొత్త రికార్డులతో లాభాలను అందించిన దేశీ మార్కెట్లు అదే ధోరణిని కొనసాగిస్తున్నాయి. యూఎస్ మార్కెట్ల లాభాల ముగింపు నేపధ్యంలో ఏషియా మార్కెట్లు సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్నాయి. అదే బాటన దేశీ సూచీలు సైతం లాభాల బాటన దూకుడుగా సాగుతున్నాయి. ఆరంభ ట్రేడింగ్ లోనే సెన్సెక్స్ 300 పాయింట్ల మేర లాభాలను నమోదు చేయగా నిఫ్టీ 13 వేల 900 పాయింట్ల వద్దకు చేరింది.