Indian Sprinter Milkha Singh: ఐసియూలో మిల్కా సింగ్

Indian Sprinter Milkha Singh: పరుగుల వీరుడు మిల్కాసింగ్ కు ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

Update: 2021-06-04 06:11 GMT

ఇండియన్ స్ప్రింటర్ మిల్ఖ సింగ్ (ఫైల్ ఫోటో)

Indian Sprinter Milkha Singh: భారత్ పరుగుల వీరుడు.. కరోనాతో పోరాడుతున్నాడు. ఒకప్పుడు క్రీడా పతకాల కోసం తనతో తానే పోరాడి గెలిచిన మిల్కాసింగ్.. నేడు కరోనాతో పోరాడి గెలవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే ఒకసారి కోవిడ్ బారిన పడి డిశ్చార్జి అయిన మిల్కాసింగ్ కు మళ్లీ ఆరోగ్య సమస్య రావడంతో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ప్రస్తుతమైతే మిల్కా ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.

ప్రముఖ భారత అథ్లెట్ దిగ్గజం మిల్కా సింగ్ మళ్లీ ఆసుపత్రిలో చేరారు. ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో కుటుంబసభ్యులు తిరిగి చండీఘడ్ లోని PGIMER ఆసుపత్రికి చేర్పించారు. సరిగ్గా నాలుగు రోజుల క్రితం కరోనాతో పోరాడి ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితి దిగజారిపోతుండటంతో ఐసీయూకి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు.

మిల్కా సింగ్.. మే 20వ తేదీన కొవిడ్తో ఆసుపత్రిలో మిల్కా సింగ్, ఆయన భార్య ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కోవిడ్ వైరస్ లక్షణాలు కనిపించడంతో ఇద్దరూ హోం ఐసోలేషన్ లో ఉంటూ.. వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకున్నారు. అనంతరం మొహాలీలోని ఆసుపత్రిలో చేరారు. కొద్ది రోజులపాటు చికిత్స తీసుకన్న మిల్కా సింగ్ కోవిడ్ నుంచి వేగంగా కోలుకున్నారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు మిల్కాసింగ్ను డిశ్చార్జ్ చేశారు. ఇక మిల్కా సింగ్ భార్య నిర్మలా కౌర్కు కొంత ఆక్సిజన్ తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో ఆమెను గత శనివారం ఐసీయూకు తరలించినట్లు చికిత్స అందిస్తున్నారు.

Tags:    

Similar News