రేపటి నుంచి 80 కొత్త రైళ్లు.. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవి ఇవే..

కరోనా వైరస్ కారణంగా దేశంలో విధించిన లాక్‍డౌన్ తర్వాత రైల్వేశాఖ దేశంలోని ప్రధాన మార్గాల్లో 230 రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే..

Update: 2020-09-11 09:10 GMT

కరోనా వైరస్ కారణంగా దేశంలో విధించిన లాక్‍డౌన్ తర్వాత రైల్వేశాఖ దేశంలోని ప్రధాన మార్గాల్లో 230 రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. వీటికి తోడు అయితే సెప్టెంబర్ 12 నుండి 80 (40 జతలు) కొత్త రైళ్లను నడపనుంది రైల్వేశాఖ, ఇందుకు సంబంధించి గురువారం నుంచే టిక్కెట్ల బుకింగ్ కూడా ఇండియన్ రైల్వే ఓపెన్ చేసింది. దీంతో ప్రయాణికులు రైల్వే వెబ్‌సైట్‌లో భారీగానే టికెట్లు బుకింగ్ చేసుకున్నారు. 80 కొత్త రైళ్లు ఇప్పటికే ఉన్న 230 ప్రత్యేక రైళ్లకు అదనంగా ఉంటాయి..

దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా అన్ని సాధారణ ప్యాసింజర్ రైళ్లను మార్చి 25 న నిలిపివేశారు. మే నుండి, రైల్వేలు అస్థిరమైన రీతిలో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాయి - మొదట ఇది వలస కార్మికులను తీసుకెళ్లేందుకు ష్రామిక్ స్పెషల్ రైళ్లను నడిపింది రైల్వే, మే 12 నుంచి 30 రాజధాని రైళ్లను, జూన్ 1 నుంచి 200 స్పెషల్ మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను పున:ప్రారంభించారు. ఇక కొత్తగా ఢిల్లీ-ఇండోర్, యశ్వంత్‌పూర్-గోరఖ్‌పూర్, పూరి-అహ్మదాబాద్, ఢిల్లీ- బెంగళూరులను అలాగే ఇతర మార్గాల్లో కలిపే ఈ కొత్త 80 రైళ్లు రేపటినుంచి పట్టాలమీద పరుగులు పెట్టనున్నాయి.

తెలంగాణ మీదుగా..

* రైలు నెంబర్ 07007 సికింద్రాబాద్ నుంచి బిహార్‌లోని దర్భంగా వెళ్లనుంది. అ రైలు మంగళ, శనివారాల్లో మాత్రమే నడుస్తుంది.

*రైలు నెంబర్ 07563 హైదరాబాద్ లోని నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభం అయి మహారాష్ట్రలోని పర్భనీకి ప్యాసింజర్ రోజూ నడుస్తుంది.

ఏపీ మీదుగా..

* రైలు నెంబర్ 02663 హౌరా నుంచి తిరుచ్చిరాపల్లికి గురు, శనివారాల్లో నడుస్తుంది. అలాగే రైలు నెంబర్ 02664 తిరుచ్చిరాపల్లి నుంచి హౌరాకు మంగళవారం, శుక్రవారం నడుస్తుంది. విజయవాడతో పాటు ఒంగోలు, నెల్లూరు, అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, విశాఖపట్నం, విజయనగరం రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.

*బెంగళూరు నుంచి గువహటికి రైలు నెంబర్ 02509 బుధ, గురు, శుక్రవారాల్లో నడుస్తుంది. రైలు నెంబర్ 02510 గువహటి నుంచి బెంగళూరుకు సోమవారం, మంగళవారం, ఆదివారం నడుస్తుంది. ఈ రైళ్లు శ్రీకాకుళం, నకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు, విజయనగరం, విశాఖటప్నం విజయవాడ స్టేషన్లలో ఆగుతాయి.

* రైలు నెంబర్ 08401 ఒడిశాలోని ఖుర్దారోడ్ జంక్షన్ నుంచి గుజరాత్‌లోని ఓఖాకు ప్రతి ఆదివారం నడుస్తుంది.

ఈ రైలు మధ్యాహ్నం 1.55 గంటలకు ఖుర్దారోడ్ నుంచి బయల్దేరి వెళుతుంది. అలాగే రైలు నెంబర్ 08402 ప్రతి బుధవారం ఉదయం 8.30 గంటలకు ఓఖా నుంచి నడుస్తుంది.. ఈ రైళ్లు శ్రీకాకుళం రోడ్, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, విజయవాడ, వరంగల్, రామగుండం, మంచిర్యాల, రాజమండ్రి, ఏలూరు,సిర్పూర్, కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. 

Tags:    

Similar News