నవీన్ మృతితో అప్రమత్తమైన మోడీ సర్కారు
*విద్యార్థుల తరలింపు కోసం యుద్ధ విమానాల ఉపయోగం *తక్షణమే యుద్ధ విమానాలు రంగంలోకి దింపాలన్న మోడీ
Indian Government: ఉక్రెయిన్లో భారత్‌కు చెందిన నవీన్ అనే వైద్య విద్యార్థి చనిపోవడంతో మోడీ సర్కారు అప్రమత్తమైనది. విద్యార్థుల్ని రెగ్యులర్ విమానాల్లో కాకుండా అతిత్వరగా చేరవేయాలని నిర్ణయించింది. అందుకే ఉక్రెయిన్లో చిక్కుకున్న భారత విద్యార్థుల తరలింపు కోసం యుద్ధ విమానాలనే రంగంలోకి దింపాలని నిర్ణయించింది. ఇది అత్యంత ఖర్చుతో కూడుకున్నదే కాక అందులో ప్రయాణించేవారి సంఖ్య కూడా బాగా తక్కువగా ఉంటుంది.
అయినా ఈ ఆపత్కాలంలో ఖర్చుకు వెనుకాడకుండా విద్యార్థుల ప్రాణాలకే విలువ ఇవ్వాలని మోడీ సర్కారు నిర్ణయించడం విశేషం. ఇప్పటికే రెండు రోజులుగా భారత విద్యార్థుల తరలింపులో ఎయిరిండియా నిమగ్నమై ఉంది. అయితే అక్కడ యుద్ధం భీతావహ వాతావరణానికి చేరుకోవడం, అణుబాంబుల ప్రయోగాలు కూడా జరుగుతుండడంతో ప్రమాద నివారణ కోసం ఆర్మీకి చెందిన యుద్ధ విమానాలను రంగంలోకి దింపుతున్నారు.