RBI Governor on Indian Economy: 100 సంవత్సరాలలో 'కరోనా' ద్వారా అతిపెద్ద సంక్షోభం : ఆర్బిఐ గవర్నర్
RBI Governor on Indian Economy: గత 100 సంవత్సరాలలో కోవిడ్ -19 అతిపెద్ద సంక్షోభం అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ శక్తికాంత డాన్స్ శనివారం అన్నారు.
RBI Governor on Indian Economy: గత 100 సంవత్సరాలలో కోవిడ్ -19 అతిపెద్ద సంక్షోభం అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ శక్తికాంత డాన్స్ శనివారం అన్నారు. ఇది ఉత్పత్తి మరియు ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపించిందని.. ప్రపంచవ్యాప్తంగా కార్మిక-మూలధన ఉద్యమాన్ని ప్రభావితం చేస్తుందన్నారు. అయితే లాక్డౌన్ ఆంక్షలను సడలించడంతో, భారత ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి వెళ్ళే సంకేతాలను చూపిస్తోందని గవర్నర్ శక్తికాంత దాస్ శనివారం తెలిపారు. 7వ ఎస్‌బిఐ బ్యాంకింగ్ & ఎకనామిక్స్ కాన్క్లేవ్‌లో ముఖ్య ఉపన్యాసం ఇచ్చిన దాస్, సెంట్రల్ బ్యాంక్..
వృద్ధి మరియు ఆర్థిక స్థిరత్వం రెండింటికీ ప్రాధాన్యత ఇస్తోందని, ప్రస్తుత సంక్షోభ సమయంలో ఆర్థిక వ్యవస్థను పరిరక్షించడానికి, అలాగే ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి అనేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. అంటువ్యాధి వల్ల కలిగే ప్రమాదాన్ని గుర్తించడానికి ఆఫ్‌సైట్ నిఘా యంత్రాంగాన్ని బలోపేతం చేస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. కరోనావైరస్ ప్రభావం వల్ల, ఎన్‌పిఎ పెరిగి మూలధనం తగ్గుతుందని అన్నారు.. పంజాబ్, మహారాష్ట్ర కో-ఆపరేటివ్ (పిఎంసి) బ్యాంక్ సమస్యను పరిష్కరించడానికి ఆర్బిఐ అన్ని వాటాదారులతో చర్చలు జరుపుతోందని ఆయన అన్నారు. ఆర్‌బిఐకి అతిపెద్ద ప్రాధాన్యత వృద్ధి అని చెప్పిన గవర్నర్.. ఆర్థిక స్థిరత్వం కూడా అంతే ముఖ్యమని అన్నారు.