N-100 Mask Manufactures in India: ఇప్పుడు మార్కెట్లో ఎన్ 100 మాస్క్

N-100 mask manufactures in India: కరోనా పుణ్యమాని లేనిపోని మాస్క్ లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈ మాస్క్ లను మూతికి తగిలించుకోవాల్సి వస్తోంది.

Update: 2020-08-10 02:17 GMT

N-100 Mask Manufactures in India: కరోనా పుణ్యమాని లేనిపోని మాస్క్ లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈ మాస్క్ లను మూతికి తగిలించుకోవాల్సి వస్తోంది. అయితే వీటిలో ఏది సురక్షితమో, ఏది కాదో తెలియక ప్రజలు సతమతమవుతున్నారు. దీని వల్ల మార్కెట్లోకి ఇదే బావుంటుంది.. అంటే ఇదే బావుంటుందంటూ ఊదరగొడుతూ జేబులు గుల్ల చేస్తున్నారు. ఇప్పటి వరకు వాడిన ఎన్ 95 మాస్క్ కు అనుగుణంగా మరింత సురక్షితంగా ఉంటుందంటూ ఎన్ 100 మాస్క్ మార్కెట్లోకి వచ్చింది.

కరోనా మహమ్మారి మనుషులకు ఎన్నో కొత్త అలవాట్లను నేర్పింది. కాదు కాదు.. పూర్వం ఉన్న పద్దతులను మళ్లీ గుర్తుచేస్తోంది. కరోనా సోకకుండా ఉండాలంటే మనుషులు ఖచ్చితంగా మాస్క్‌లు ధరించాల్సిందే. అంతేకాదు.. నిత్యం చేతులను శుభ్రంగా కడుక్కోవడంతో పాటు.. సోషల్ డిస్టెన్స్‌ పాటించాల్సిందే. అయితే ప్రస్తుతం అంతా మాస్క్‌లను ఉపయోగిస్తున్నారు. ఇందులో అనేక రకాలు ఉన్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్‌ను నిలువరించేందుకు ఎన్‌95 మాస్క్‌లను వాడాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఈ క్రమంలో వీటికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. అయితే వీటికి కొన్నింటికి వాల్‌ ఉండటంతో అవి కరోనాను నిలువరించలేవన్న వార్తలు వినిపించాయి. దీంతో ఇప్పుడు ఎన్‌-100 మాస్క్‌ను తయారు చేసింది ఓ సంస్థ. ఈ మాస్క్‌ గాలిని 99.97% ఫిల్టర్‌ చేస్తుంది. దీనిని ఎక్సెల్ 3 డీ అడ్వాన్స్ టెక్నాలజీ అనే ఓ సంస్థ తయారు చేసింది. ముంబైకి చెందిన ఓ ఇద్దరు యువకులు.. ఫ్రంట్‌ లైన్ వారియర్స్‌ కష్టాలను చూసి.. దీనిని డెవలప్ చేశారు. దీనికి 'ఎక్స్‌డీ 100'అని నామకరణం చేశారు. అయితే ఇలాంటి మాస్కులను ప్రపంచంలో ఇప్పటివరకూ 9 కంపెనీలు మాత్రమే రెడీ చేస్తున్నాయని తెలిపారు.ఈ ఎన్‌-100 ఒక్కో మాస్కు ధర రూ .1200 ఉండనుంది. అధికారికంగా అనుమతులు లభించిన వెంటనే. వీటిని మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.

Tags:    

Similar News