Indian Army: డ్రాగన్ కంట్రీకి ఇండియన్ ఆర్మీ దీటైన జవాబు

Indian Army: చైనా ఎగరేసిన రోజే త్రివర్ణ పతాకం ఆవిష్కరణ

Update: 2022-01-04 12:14 GMT

డ్రాగన్ కంట్రీకి ఇండియన్ ఆర్మీ దీటైన జవాబు

Indian Army: గల్వాన్ లోయలో డ్రాగన్ కంట్రీ మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడింది. నూతన సంవత్సరం సాక్షిగా గల్వాన్ లోయలో జెండాను ఎగరేసి కయ్యానికి కాలు దువ్వింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొత్త సంవత్సరం రోజునే గల్వాన్ లోయలో చైనా పతాకం రెపరెపలాడిందంటూ చైనా అధికారిక మీడియా జర్నలిస్ట్ షెన్ షివె ట్వీట్ చేయడం హాట్‌టాపిక్ అయింది. గల్వాన్ లోయ నుంచి చైనా ప్రజలకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు శుభాకాంక్షలు తెలియజేశారంటూ ట్వీట్ చేశారు.

ఈ ఘటనపై రాహుల్ గాంధీ సహా కొందరు నేతలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. గల్వాన్ లోయలో మన త్రివర్ణ పతాకం కూడా చాలా బాగుంటుందని  చైనాకు దీటైన జవాబు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు రాహుల్. ప్రధాని మోడీ ఇకనైనా మౌనాన్ని వీడండి అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే గల్వాన్ లోయలో కవ్వింపులకు దిగిన డ్రాగన్‌కు భారత ఆర్మీ అంతే దీటుగా జవాబిచ్చింది. గల్వాన్ వ్యాలీలో చైనా జెండాను ఆవిష్కరించిన రోజునే మన సైన్యమూ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించింది. దీనికి సంబంధించిన ఫొటోలు విడుదలయ్యాయి. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్‌లో ఫొటోలను పోస్ట్ చేశారు. నూతన సంవత్సరం రోజున ధీశాలులైన భారత జవాన్లు గల్వాన్ లోయలో జెండా ఎగరేశారంటూ కామెంట్ చేశారు. 

Tags:    

Similar News