గౌహతిలో ఇండియన్ ఆర్మీ పూర్వోత్తర్ స్వాభిమాన్ ఉత్సవాలు

* అంబరాన్న అబ్బుర పరచిన వైమానిక విన్యాసాలు.. ఆజాదికా అమృత్ మహోత్సవాల్లో ఇండియన్ ఆర్మీ మెగా ‎ఈవెంట్‌

Update: 2022-11-22 01:54 GMT

గౌహతిలో ఇండియన్ ఆర్మీ పూర్వోత్తర్ స్వాభిమాన్ ఉత్సవాలు

Purvottar Swabhiman Utsav: అస్సాంలోని గౌహతిలో ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో పూర్వోత్తర్ స్వాభిమాన్ ఉత్సవాలను ఘనంగా నిర్విహించింది. రెండు రోజులపాటు సాగిన ఈ ఉత్సవాల్లో ఇండియన్ ఆర్మీ గగన తలాన అద్భుతమైన విన్యాసాలను ప్రదర్శించింది. ఆజాదికా అమృత్ మహోత్సవాల్లో ఇండియన్ ఆర్మీ మెగా ‎ఈవెంట్‌ను నిర్వహించింది. గువాహటిలోని ఇందిరాగాంధీ అధ్లెటిక్‌ స్టేడియంలో వైమానిక విన్యాసాలను ప్రదర్శించారు. ఆపద సమయంలో పౌరుల ప్రాణాలు కాపాడేందుకు ఇండియన్ ఆర్మీ అనుసరించే విధి విధానాలను ప్రదర్శించారు. భారత జాతీయ జెండా రంగుల్లో పారాచూట్, సైనిక విమానాల ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. గగన తలంలో వైమానిక దళం హెలికాప్టర్లపై చక్కర్లు కొడుతూ విపత్కర పరిస్థితుల్లో సహాయ సహకారాలు అందించే తీరును కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు.

Tags:    

Similar News