చైనా సైనికుడిని అప్పగించిన భారత్

రెండు రోజుల క్రితం లడఖ్‌లో భారత సైన్యం పట్టుకున్న చైనా సైనికుడిని మంగళవారం రాత్రి చుషుల్-మోల్డోలో ఆ దేశానికీ అప్పగించారు. సోమవారం, చైనా సైనికుడు లైన్ ఆఫ్ యాక్చువల్..

Update: 2020-10-21 05:07 GMT

రెండు రోజుల క్రితం లడఖ్‌లో భారత సైన్యం పట్టుకున్న చైనా సైనికుడిని మంగళవారం రాత్రి చుషుల్-మోల్డోలో ఆ దేశానికీ అప్పగించారు. సోమవారం, చైనా సైనికుడు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఐసి) లో తిరుగుతూ లడఖ్ లోని చుమర్-డెమ్చోక్ ప్రాంతానికి చేరుకున్నాడు. దీంతో చైనా అధికారులు భారత ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపింది. అయితే ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత చైనా సైనికుడిని ప్రోటోకాల్ ప్రకారం తిరిగి ఇస్తామని భారత సైన్యం అదే రోజు తెలిపింది. మీడియా నివేదికల ప్రకారం, ఆ సైనికుడిని అప్పగించారని.. చైనా భూభాగంలోకి చేరుకున్న తరువాత నిపుణులు అతన్ని ప్రశ్నించారు.

కాగా భారత్ లో ఉన్నంతసేపు వైద్య సహాయం, ఆహారం మరియు వెచ్చని బట్టలు ఇచ్చారని, అందువల్ల అతనికి ఎటువంటి సమస్య లేదని భారత సైన్యం తెలిపింది. ఇదిలావుంటే భారత్- చైనా దేశాల మధ్య నిరంతర ఉద్రిక్తతల మధ్య , శీతాకాలంలో కూడా లడఖ్‌లో నిలబడటానికి భారత సైన్యం సిద్ధమవుతోంది, ఎత్తైన వ్యూహాత్మక ప్రాంతాల్లో పట్టు సాధించడానికి ఏర్పాట్లను కూడా పూర్తి చేసుకుంది. ఇందుకోసం యుఎస్ నుండి యుద్ధ కిట్లు మరియు శీతాకాలపు దుస్తులను కొనుగోలు చేసింది. భారత దళాలు లడఖ్‌లోని పంగోంగ్ సరస్సుకి దక్షిణంగా ఉన్న 13 ముఖ్యమైన శిఖరాలను ఆక్రమించాయి.  

Tags:    

Similar News