Indian Army Jobs: పదో తరగతి అర్హతతో ఇండియన్ ఆర్మీలో జాబ్స్..!
Indian Army Jobs: పదో తరగతి అర్హతతో ఇండియన్ ఆర్మీలో జాబ్స్..!
Indian Army Jobs: సైన్యంలో పనిచేయాలనే ఆసక్తి కలిగిన యుతకి ఇది సువర్ణవకాశమని చెప్పవచ్చు. పదో తరగతి పాస్ అయితే చాలు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. మంచి జీతం, అలవెన్సులు, ప్రభుత్వ సౌకర్యాలు పొందవచ్చు. ఇండియన్ ఆర్మీకి చెందిన బీహార్ రెజిమెంటల్ సెంటర్ (BRC) గ్రూప్ సీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం మొదలగు వివరాలు తెలుసుకుందాం.
మొత్తం పోస్టుల 12 ఉన్నాయి. అన్ని గ్రూప్ సీ సివిలియన్ పోస్టులు మాత్రమే. అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్తులకి నెలకు రూ.18,000ల నుంచి 56,900ల వరకు జీతంగా చెల్లిస్తారు. సఫాయివాలా పోస్టులకు పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కుక్ పోస్టులకు పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కుకింగ్‌లో నైపుణ్యం ఉండాలి. వాషర్ మెన్ పోస్టులకు పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే మిలిటరీ దుస్తులను శుభ్రపరచడంలో నైపుణ్యం ఉండాలి.
బార్బర్ పోస్టులకు పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కార్పెంటర్ పోస్టులకు పదో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ లేదా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ నుంచి కార్పెంటర్‌గా 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ మే 13 2022గా నిర్ణయించారు.