Indian Air Force Jobs 2021: టెన్త్, ఇంటర్ అర్హతతో జాబ్స్
Indian Air Force Jobs 2021: ఐఏఎఫ్ 257 గ్రూప్-సీ సివిలియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
Indian Air Force Jobs 2021: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సౌత్ వెస్టర్న్‌కు చెందిన 257 గ్రూప్-సీ సివిలియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://indianairforce.nic.in/ వెబ్సైట్ చూడొచ్చు. అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకుని ఆఫ్ లైన్ లో తగిన డాక్యుమెంట్స్ తో దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం ఖాళీలు: 257
- ఏఏ పోస్టులు: మల్టీటాస్కింగ్ స్టాఫ్, హౌజ్‌కీపింగ్ స్టాఫ్, మెస్ స్టాఫ్, ఎల్డీసీ, క్లర్క్ హిందీ టైపిస్ట్ తదితర పోస్టులున్నాయి.
- అర్హత: పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.
- జీతం: పోస్టులను బట్టి నెలకు రూ.18000 నుంచి రూ.25500 వరకు ఉంటుంది.
- ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్ మరియు రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
- దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో
- దరఖాస్తులకు పంపాల్సిన చివరి తేది: ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ఉద్యోగ ప్రకటన వెలువడిన 30 రోజుల్లోపు
- వెబ్సైట్: https://indianairforce.nic.in/