Covid‌-19 : వ్యాక్సిన్‌పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన

కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ విషయంలో కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ అత్యవసర వాడకానికి వ్యాక్సిన్‌ భద్రత, సామర్థ్యం గురించిన డేటా అవసరమని‌ పేర్కొన్నారు..

Update: 2020-10-12 02:09 GMT

కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ విషయంలో కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ అత్యవసర వాడకానికి వ్యాక్సిన్‌ భద్రత, సామర్థ్యం గురించిన డేటా అవసరమని‌ పేర్కొన్నారు. ప్రస్తుతం భారతదేశంలో క్లినికల్ ట్రయల్స్ తొలి, మలి, మూడవ దశ పరీక్షలు జరిపే దశలో ఉన్నాయని.. ఈ నేపథ్యంలో టీకా వ్యూహాన్ని రూపొందించడానికి డేటా ఉపయోగించబడుతుందని అన్నారు. సండే సంవాద్‌లో తన ఫాలోయర్లతో ప్రతి వారం జరిపే సంప్రదింపుల్లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్‌ ప్రయోగ ఫలితాల ఆధారంగా భవిశ్యత్ లో దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. వైరస్‌ సోకే ముప్పున్న వ్యక్తుల తోపాటు వైరస్‌ కారణంగా మరణించే అవకాశాలు ఉన్న రోగులకు ముందుగా వ్యాక్సిన్ అందిస్తామని మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.

మరోవైపు ముందుగా తయారు చేసిన కోవిడ్‌-19 వ్యాక్సిన్‌లను కూడా సమీకరించే అవకాశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆయన చెప్పారు. సీఎస్‌ఐఆర్‌-ఐజీఐబీ అభివృద్ధి చేసిన ఫెలుదా పేపర్‌ స్ర్టిప్‌ పరీక్షను త్వరలో దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టనున్నట్టు ఆయన చెప్పారు. ఇక కరోనా మహమ్మారిని బాడీలో ఉండే విషయాన్ని గుర్తించడంలో 98 శాతం కచ్చితత్వం ఉన్నట్టు ప్రయోగ పరీక్షల్లో వెల్లడైందని మంత్రి స్పష్టం చేశారు. ఇక రానున్న పండగల దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవరమైన భౌతిక దూరాన్ని ఖఛ్చితంగా పాటించాలని కోరారు.

Tags:    

Similar News