DRDO: అభ్యాస్ ఎయిర్‌క్రాప్ట్ టెస్ట్ సక్సెస్
DRDO: ఒడిషాలోని చాందీపూర్‌లో పరీక్షించిన డీఆర్‌డీవో
DRDO: అభ్యాస్ పేరుతో తక్కువ ఎత్తులో దూసుకెళ్లే ఎయిర్‌క్రాప్ట్-హీట్‌ను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో ఈ పరీక్ష జరిగింది. పరీక్షలో ఎయిర్‌క్రాఫ్ట్‌ను అతి తక్కువ ఎత్తులో పరీక్షించారు. ఈ పరీక్ష నిర్వహించిన సమయంలో సెన్సార్లు ఆ ఏరియల్ టార్గెట్‌కు చెందిన రాడర్, ఎలక్ట్రికల్ ఆప్టికల్ సిస్టమ్‌ను ట్రాక్ చేశాయి. ట్విన్ బూస్టర్లతో ఈ ఎయిర్ వెహికిల్ పనిచేస్తుంది. అయితే సుదీర్ఘ దూరం ప్రయాణించేందుకు ఆ వాహనంలో గ్యాస్ టర్బైన్ ఇంజిన్‌ను అమర్చారు. ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ డిఫెన్స్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్, డీఆర్డీవో కలిసి అభ్యాస్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను డెవలప్ చేశాయి. అభ్యాస్ విజయవంతమవడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్డీవోకు కంగ్రాట్స్ తెలిపారు.