India: భారత్‌లో కొనసాగుతున్న కరోనా కల్లోలం

India: భారత్‌లో కరోనా కల్లోలం కంటిన్యూ అవుతోంది. గత కొద్ది రోజులుగా 50వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంటే తాజాగా ఆ సంఖ్య మరింత పెరుగుతోంది.

Update: 2021-03-28 12:37 GMT

India: భారత్‌లో కొనసాగుతున్న కరోనా కల్లోలం

India: భారత్‌లో కరోనా కల్లోలం కంటిన్యూ అవుతోంది. గత కొద్ది రోజులుగా 50వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంటే తాజాగా ఆ సంఖ్య మరింత పెరుగుతోంది. దీంతో దేశంలో సెకండ్ వేవ్ కల్లోలం మొదలైందా? అన్న భయం ప్రజలను వెంటాడుతోంది.

భారత్‌లో కరోనా కల్లోలం కంటిన్యూ అవుతోంది. వరుసగా రెండోరోజు 62వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య ఒక కోటీ 19లక్షల 71వేల 624కి చేరింది. కొత్తగా 312 మంది కరోనాతో మరణించారు. మొత్తం మరణాల సంఖ్య లక్షా 61వేల 552 కు చేరుకుంది. మరణాల రేటు 1.3 శాతంగా ఉండగా కొత్తగా 28,739 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య ఒక కోటీ 13లక్షల 23వేల 762కి చేరింది. అటు రికవరీ రేటు 94.6 శాతంగా ఉంది. దేశంలో ప్రస్తుతం 4లక్షల 86వేల 310 యాక్టివ్ కేసులున్నాయి.

మరోవైపు గుజ‌రాత్ రాజ‌ధాని అహ్మదాబాద్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి క‌ల‌క‌లం రేపింది. అహ్మదాబాద్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో విద్యార్థులు, ప్రొఫెస‌ర్లు క‌లిపి మొత్తం 40 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దాంతో వారంద‌రినీ ఐసోలేష‌న్‌లో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. అహ్మదాబాద్‌ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు చెందిన డిప్యూటీ హెల్త్ ఆఫీస‌ర్ మెహుల్ ఆచార్య ఈ విష‌యాన్ని వెల్లడించారు.

ఇక దేశవ్యాప్తంగా నమోదైన కొత్త కేసుల్లో 79.57 శాతం కేసులు కేవలం ఆరు రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనార్హం. వీటిలో మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్‌లు ఉన్నాయి. ఇందులోనూ మహారాష్ట్రలో అత్యధికంగా 36వేల 902 కేసులు నమోదయ్యాయి. కేవలం మహారాష్ట్ర, పంజాబ్, కేరళల్లోనే 73 శాతం కేసులు నమోదయ్యాయి. 10 రాష్ట్రాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 

Tags:    

Similar News