India: భారత్‌లో రికార్డు స్థాయిలో రికవరీలు

India: అటు దేశంలో ఇప్పటివరకు మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 2కోట్ల 29లక్షల 92వేల 517

Update: 2021-05-12 13:32 GMT

కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి (ఫైల్ ఇమేజ్)

India: భారత్‌లో కరోనా వైరస్‌ ఉద్ధృతి తగ్గింది. దేశంలో 3లక్షల 29వేల 942 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత 14 రోజుల్లో ఇంత తక్కువ కేసులు రావడం ఇదే మొదటిసారి. చివరిసారిగా ఏప్రిల్‌ 26వ తేదీ 3లక్షల 19వేల మందికి కరోనా సోకింది. కాగా మంగళవారం ఒక్కరోజే 3వేల 876 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు. అటు దేశంలో ఇప్పటివరకు మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 2కోట్ల 29లక్షల 92వేల 517కు చేరుకోగా మొత్తం మరణాల సంఖ్య 2లక్షల 49వేల 992కు చేరింది.

దేశంలో మరణాల రేటు 1.09శాతంగా ఉంది. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్యలో చూస్తే యాక్టివ్‌ కేసుల సంఖ్య 16.14 శాతానికి చేరుకుంది. ఇక దేశంలోని మొత్తం కేసుల్లో 74శాతం కేసులు 10 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళతోపాటు తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌, ఏపీ, బెంగాల్‌, రాజస్థాన్‌, హరియాణా, ఢిల్లీలో అత్యధికంగా కొత్త కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా కొత్తగా నమోదైన కేసుల్లో 69.88శాతం కేసులు కేవలం 10 రాష్ట్రాల్లోనే ఉన్నాయి.

ఇక 62 రోజుల తర్వాత తొలిసారిగా కొత్త కేసుల సంఖ్య కంటే రికవరీల సంఖ్య అధికంగా ఉంది. ఒక్కరోజులో 3లక్షల 56వేల 82మంది కోలుకున్నారు. దీంతో మొత్తంగా కోవిడ్‌ నుంచి కోలుకున్నవారి సంఖ్య కోటి 90లక్షల 27వేల 304కు పెరిగింది.

Tags:    

Similar News