టెన్షన్ పుట్టిస్తోన్న కొత్త కరోనా వేరియెంట్.. జనవరి 5 వరకు రాత్రి కర్ఫ్యూ విధించిన..

Update: 2020-12-22 03:37 GMT

బ్రిటన్‌లో వెలుగు చూసిన కరోనా స్ట్రెయిన్‌తో భారత్ అప్రమత్తం అయింది. వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. డిసెంబర్ 31 వరకు బ్రిటన్‌కు విమాన రాకపోకలను నిలిపివేస్తున్నట్టు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. రేపటి నుంచి ఆంక్షలు అమల్లోకి వస్తాయని వెల్లడిచింది. బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులను మంగళవారం అర్ధరాత్రి వరకు అనుమతిస్తామని ప్రయాణికులు విమానాశ్రయాల్లో తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. పాజిటివ్ వచ్చిన వారు రాష్ట్ర ప్రభుత్వ క్వారంటైన్‌కు వెళ్లాలని, నెగెటివ్ వచ్చినా ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్‌‌లో ఉండాలని పేర్కొంది. కొత్త వైరస్‌పై భయాందోళనలు అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.

బ్రిటన్ నుంచి హైదరాబాద్‌కు విమానాలు రాకపోకలు సాగిస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. వారం, పది రోజుల్లో దాదాపు 3 వేల మంది వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వీరందరినీ కరోనా నిర్ధారణ పరీక్షల రిపోర్ట్ పరిశీలించిన తర్వాతే నగరంలోకి అనుమతి ఇనుమతిచ్చినట్టు ఎయిర్ పోర్ట్ అధికారులు వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన వారు హోం క్వారంటైన్‌లో ఉండాలంటూ సూచించారు.

మరోవైపు కొత్త మహమ్మారితో మహారాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇవాల్టీ నుంచి వచ్చే నెల 5 వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రకటించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం ఆరింటి వరకు రిస్ట్రిక్షన్లు ఉంటాయని పేర్కొంది. యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి ముంబైకి వచ్చే వాళ్లు 14రోజుల పాటు ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్‌లో ఉండటాన్ని తప్పనిసరి చేసింది. ఈ దేశాల నుంచి మహారాష్ట్రకు వచ్చాక ఏడో రోజు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయాలని ఆదేశించింది. వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఉద్దవ్ ఠాక్రే సూచించారు.

గత 14 రోజుల్లో యూకే, నెదర్లాండ్, డెన్మార్క్ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను ట్రాక్ చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. యూరప్ దేశాల్లో రూపాంతరం చెందిన కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో యూకేకు విమాన రాకపోకలను నిలిపివేస్తూ కేంద్రం తీసుకున్న కొన్ని గంటల్లోనే కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.

Tags:    

Similar News