కేరళలో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక

* ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ * ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక

Update: 2021-11-15 05:48 GMT

కేరళలో భారీ వర్షాలు(ఫైల్ ఫోటో)

Kerala: కేర‌ళ‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఎర్నాకులం, ఇడుక్కి, త్రిస్సూర్‌ జిల్లాల్లో ఆదివారం రెడ్ అలర్ట్ ప్రకటించింది IMD.

అకాల వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని, ఇతర ప్రమాదాల దృష్ట్యా ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరారు. పశ్చిమ గాలుల్లో భాగంగా కేరళలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు.

రానున్న గంటల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొండచరియలు విరిగిపడే, వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు లేదా సమీపంలోని సహాయక శిబిరాలకు తరలించాల్సి ఉంటుందని సూచించారు.

మరో రెండ్రోజులు కేరళలో ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొల్లాం, కొట్టాయం, పతనంతిట్ట, ఎర్నాకులం, అలప్పుజలో ఇవాల విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. 

Tags:    

Similar News