Hyderabad: హైదరాబాద్ నుంచి మరో కోవిడ్ వ్యాక్సిన్
Hyderabad: భారత్‌లో మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని కేంద్రం వెల్లడించింది.
Hyderabad: భారత్‌లో మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్‌కి చెందిన బయోలాజికల్ ఈ అనే సంస్థ ఆగస్టు నాటికి కరోనా వ్యాక్సిన్‌ను అందించనుందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. నెలకు 7 కోట్ల డోసులను ఉత్పత్తి చేయగల సామర్ధ్యం బయోలాజికల్ ఈ సొంతమని వీకే పాల్ తెలిపారు. ఇప్పటికే ఫేజ్ 1, ఫేజ్ 2 ట్రయల్స్ పూర్తయ్యాయని పాల్ తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా 100 కోట్ల డోసులను తయారు చేసే దిశగా బయోలాజికల్ ఈ కార్యాచరణ రూపొందించారు.