Cervical Cancer Vaccine: గర్భాశయ క్యాన్సర్ నుంచి మహిళలకు విముక్తి.. స్వదేశీ టీకా వచ్చేసింది..

Cervical Cancer Vaccine: సర్వైకల్‌ క్యాన్సర్‌కు దేశంలోనే తొలిసారిగా వ్యాక్సిన్‌‌ను ప్రారంభించారు.

Update: 2022-09-01 15:45 GMT

Cervical Cancer Vaccine: గర్భాశయ క్యాన్సర్ నుంచి మహిళలకు విముక్తి.. స్వదేశీ టీకా వచ్చేసింది

Cervical Cancer Vaccine: సర్వైకల్‌ క్యాన్సర్‌కు దేశంలోనే తొలిసారిగా వ్యాక్సిన్‌‌ను ప్రారంభించారు. ఈ టీకా సర్వైకల్‌ క్యాన్సర్‌ నివారణలో ముఖ్య పాత్రను పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు. గర్భాశయ క్యాన్సర్‌కు యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆమోదించిన గారాసిల్డ్‌9 అనే హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ఇప్పటి వరకు వినియోగిస్తుండగా స్త్రీ జననాంగం వద్ద వచ్చే క్యాన్సర్‌ను తగ్గించడంలోనూ ప్రయోజనకరంగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. సర్వైకల్‌ క్యాన్సర్‌ మహిళల గర్భాశయంలో అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా ప్రకారం 2018లో ప్రపంచవ్యాప్తంగా 5.70 లక్షల మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని అంచనా వేయగా దాదాపు 3.11 లక్షల మంది ఈ క్యాన్సర్‌ బారిన పడి మరణించారు.

Tags:    

Similar News