Coronavirus: కరోనా చికిత్సకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు
Coronavirus: కరోనా చికిత్సకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్రం.
Coronavirus: కరోనా చికిత్సకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్రం. ఇకపై.. కోవిడ్ లక్షణాలు ఉంటే..టెస్ట్ రిపోర్ట్‌తో నిమిత్తం లేకుండా ఆస్పత్రుల్లో చేరొచ్చని స్పష్టం చేసింది. ఆస్పత్రిలో చేర్చుకునేందుకు కరోనా పాజిటివ్ రిపోర్టు అవసరం లేదని సూచించింది. అలాగే.. కోవిడ్ ఆస్పత్రుల్లో చేరేందుకు ఎలాంటి గుర్తింపు కార్డు కూడా అవసరం లేదని స్పష్టం చేసింది కేంద్రం. పేషెంట్‌కు ఆస్పత్రిలో చికిత్స అవసరం ఉందా లేదా అన్నదే ముఖ్యమని..అతను ఎక్కడి నుంచి వచ్చాడు, గుర్తింపు కార్డు ఉందా అని అడగాల్సిన పనిలేదని కేంద్రం కొత్త మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.