Sputnik V Vaccine: భారత్‌లో మూడో వ్యాక్సిన్‌ ఆమోదానికి రంగం సిద్ధం

Sputnik V Vaccine: రష్యాకు చెందిన స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌ను ఇవాళ ఆమోదించే అవకాశం

Update: 2021-04-12 07:06 GMT

స్పుత్నిక్ వాక్సిన్ (ఫైల్ ఇమేజ్)

Sputnik V Vaccine: భారత్‌లో మూడో వ్యాక్సిన్‌ ఆమోదానికి రంగం సిద్ధం అవుతోంది. రష్యాకు చెందిన స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌ను ఇవాళ ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్‌ ఆమోదానికి సంబంధించిన సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్‌ కమిటీ సమావేశం జరగనుంది. అత్యవసర వినయోగం ఉన్న నేపథ్యంలో కమిటీ ఆమోదం తెలపనుంది. కరోనా వ్యాక్సిన్‌ కొరత నేపథ్యంలో మూడో వ్యాక్సిన్‌ను ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పటికే త్వరలో దేశంలో మరో 5 వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌ రెండు అందుబాటులో ఉన్నాయి. భారత్‌లో స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు అనుమతి లభించడంతో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, పెనాసియా బయోటెక్‌, గ్లాండ్‌ఫార్మాలో స్పుత్నిక్‌ వి తయారుకానుంది. స్పుత్నిక్‌ వి ఆమోదం పొందితే వ్యాక్సిన్‌ కొరతకు ఉపశమనం లభించనుంది.

Tags:    

Similar News