Covid Vaccine: వ్యాక్సినేషన్‌లో 150 కోట్ల మార్క్‌ దాటిన భారత్‌

Covid Vaccine: భారత్‌ కరోనా వ్యాక్సినేషన్‌లో మరో కీలక మైలురాయిని అధిగమించింది...

Update: 2022-01-08 02:30 GMT

Covid Vaccine: వ్యాక్సినేషన్‌లో 150 కోట్ల మార్క్‌ దాటిన భారత్‌

Covid Vaccine: భారత్‌ కరోనా వ్యాక్సినేషన్‌లో మరో కీలక మైలురాయిని అధిగమించింది. దేశంలో 150 కోట్ల డోసుల కోవిడ్‌ టీకా పంపిణీ పూర్తయిందని కేంద్రం తెలిపింది. ఆరోగ్య కార్యకర్తల కృషి వల్లే ఈ చారిత్రక విజయం సాధ్యమైందని కేంద్ర ఆరోగ్య మంత్రి తెలియజేశారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమంతో ఎన్నో జీవితాలను కాపాడినట్లయిందన్నారు ప్రధాని మోడీ.

91శాతం మంది ఒక్క డోసు టీకా వేయించుకోగా.., 66 శాతం మందికి రెండు డోసులు పూర్తయిందని అధికారులు తెలిపారు. జనవరి 3వ తేదీ నుంచి మొదలైన వ్యాక్సినేషన్‌లో అర్హులైన 22శాతం మంది బాలబాలికలు టీకా వేయించుకున్నారని చెప్పారు. ముందు జాగ్రత్త డోస్‌ కోసం కొత్తగా రిజిస్ట్రేషన్‌ అక్కర్లేదని, నేరుగా ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్‌ తీసుకోవచ్చని ప్రభుత్వం స్పస్టం చేసింది.

Tags:    

Similar News