సరిహద్దులో కొనసాగుతోన్న ఉద్రిక్తతలు.. భారత్ కు పట్టు దొరికింది!

సరిహద్దులో భారత్‌- చైనాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి..

Update: 2020-09-04 04:14 GMT

సరిహద్దులో భారత్‌- చైనాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తూర్పు లద్దాఖ్‌లో ఇరుదేశాల మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న పాంగాంగ్‌ సరస్సు వద్ద ఇరుదేశాల బలగాలు మోహరించి ఉన్నాయి. అయితే చైనా‌ బలగాల కన్నా ఎత్తైన పర్వతాల్లో భారత్ బలగాలు మోహరించాయి. ఒకవేళ చైనా సైనికులు రెచ్చిపోయి దాడి చేస్తే.. ప్రతిదాడి చేసేందుకు ఈ ప్రాంతాలు భారత్ కు అనువుగా ఉన్నాయి. పర్వత ప్రాంతంలో ఉండటం వలన చైనా కదలికలు.. పసిగట్టడం కూడా సులువుగా ఉంది.

కాగా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఐసి) లో ఆగస్టు 29 మరియు 30 రాత్రి భారత దళాలు భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. LAC లోని పర్వత శిఖరాలను పట్టుకోవటానికి ప్రయత్నిస్తున్న చైనా సైన్యాన్ని అడ్డుకోవడంతో భారత దళాలు ఎత్తు ప్రదేశాల్లో ఉన్నాయి.. అయినా కూడా చైనా దళాలు దూకుడు కొనసాగిస్తూనే ఉన్నాయి. అయితే ఉత్తర తీరంలోని ఫింగర్‌-4 పర్వతాలు మాత్రం చైనా అధీనంలో ఉన్నాయి. ఫింగర్‌-4 ప్రాంతంలోనూ కొన్ని పర్వత శిఖరాలను భారత్ తన అధీనంలోకి తెచ్చుకుంది. దాంతో చైనా దూకుడుకు కళ్లెం పడినట్లయింది. ఇక ఇదిలావుంటే భారత్ - చైనా సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యాధిపతి జనరల్‌ MM నారవణె రెండు రోజుల పర్యటన కోసం లద్దాఖ్‌ కు వచ్చారు. సరిహద్దు శిబిరాన్ని సందర్శించిన ఆయన పలువురు ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో సైనికుల సన్నద్ధతను అడిగిగి తెలుసుకున్నారు. 

Tags:    

Similar News