China Withdraws Troops At Galwan Valley: గల్వాన్ లోయలో కీలక పరిణామం!
China Withdraws Troops At Galwan Valley: గత నెల భారత్, చైనా దేశాల మధ్య హింసాత్మక ఘటన అనంతరం కీలకమైన గల్వాన్ లోయలో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది.
China Withdraws Troops At Galwan Valley: గత నెల భారత్, చైనా దేశాల మధ్య హింసాత్మక ఘటన అనంతరం కీలకమైన గల్వాన్ లోయలో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. గల్వాన్ లోయ నుంచి చైనా బలగాలు దాదాపు కిలోమీటరు మేర వెనక్కి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ విషయం అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి. అంతేకాకుండా అక్కడ చేపట్టిన నిర్మాణాలను సైతం చైనా తొలగిస్తున్నట్ల వర్గాలు తెలిపాయి. చైనా తీరుకు ప్రతిగా భారత బలగాలు కూడా వెనక్కి మళ్లినట్టు సమాచారం. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి 'బఫర్ జోన్' ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే బలగాల ఉపసంహరణలో చైనా ఎంతమేరకు నిజాయితీగా ఉంటుందనేది తెలియాలి.
గతనెల కూడా తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయ ప్రాంతంలోని భారత భూభాగంలో పెట్రోలింగ్ పాయింట్ 14 వద్ద అక్రమంగా వేసిన గుడారాన్ని తొలగించమని భారత సైనికులు ఆదేశించగా.. చైనా ఆర్మీ మాత్రం దాడికి తెగబడింది. ఆ సమయంలో వారు వెనక్కి వెళ్లినట్టు వెళ్లి భారత సైనికులపై హింసాత్మక దాడికి పాల్పడడంతో 20 మంది భారత జవాన్లు అమరవీరులయ్యారు. అంతేకాకుండా చైనీయులు కూడా 35 మందికి పైగానే మరణించారు. ఆ తరువాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయి చేరాయి. భారత్- చైనా మధ్య వివిధ స్థాయిల్లో మూడు దఫాలుగా చర్చలు జరిగాయి. సరిహద్దులో చైనా తీరుకు వ్యతిరేకంగా భారత్ లో చైనాకు చెందిన 59 యాప్ లను భారత ప్రభుత్వం నిషేధించింది. అయితే ఇందుకు ప్రతీకారంగా చైనా కూడా wion న్యూస్ వెబ్ సైట్ ను ఆ దేశంలో బ్లాక్ చేసింది.