ఫిబ్రవరి కల్లా కొవిడ్‌ నియంత్రణ..!

Update: 2020-10-19 07:15 GMT

ప్రపంచ దేశాలను ఓ కుదుపు కుదిపిన కరోనా వేగానికి భారత్‌లో బ్రేకులు పడుతున్నాయి. కొద్ది రోజులుగా దేశంలో పాజిటివ్‌ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే కరోనా గరిష్ట స్థాయిని మించిపోయిందన్న కేంద్ర కొవిడ్ కమిటీ, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కరోనాకు ముకుతాడు వేయొచ్చని అభిప్రాయపడింది. అన్ని జాగ్రత్తలు చర్యలు పాటిస్తే నియంత్రణ సులభమవుతుందని తెలిపింది.

దేశంలో కరోనా పరిస్థితులపై పలు కీలక విషయాలను వెల్లడించింది కేంద్ర కొవిడ్ కమిటీ. 2021 ఫిబ్రవరిలో కరోనా చివరిదశకు చేరుకుంటుందని తెలిపిన కమిటీ అప్పటివరకు దేశంలో కోటి ఐదు లక్షలకు పైగా కేసులు నమోదవుతాయని అంచనా వేసింది. దేశంలో లాక్‌డౌన్‌ విధించకపోయి ఉంటే జూన్‌ నాటికే కోటి 40 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదయ్యేవని తెలిపింది కొవిడ్ కమిటీ.

ఇక రానున్న కాలంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది కొవిడ్ కమిటీ. శీతాకాలం అందులోనూ పండగ సీజన్‌ కావటంతో కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని తెలిపింది. లేదంటే నెల వ్యవధిలో 26 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది కమిటీ. మరోవైపు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ కరోనా నిబంధనలు పాటించి ఇళ్లలోనే పండగలు చేసుకోవాలని సూచించారు. ఈ సమయంలో నిర్లక్ష్యం వహిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని రీసెంట్‌గా కేరళలో జరిగిన ఓనమ్‌ పండగే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. 

Tags:    

Similar News