పాకిస్థాన్ పై తొలిసారి ఘాటుగా స్పందించిన భారత్.. విషం కక్కుతున్న వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానెళ్ల నిషేధం

YouTube Channels: పాకిస్థాన్ భూభాగం నుంచి పనిచేస్తూ భారత్ పై యుద్ధం ప్రకటించిన కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్ సైట్లపై కేంద్రం కన్నెర్ర చేసింది.

Update: 2021-12-21 11:05 GMT

పాకిస్థాన్ పై తొలిసారి ఘాటుగా స్పందించిన భారత్.. విషం కక్కుతున్న వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానెళ్ల నిషేధం

YouTube Channels: పాకిస్థాన్ భూభాగం నుంచి పనిచేస్తూ భారత్ పై యుద్ధం ప్రకటించిన కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్ సైట్లపై కేంద్రం కన్నెర్ర చేసింది. తొలిసారిగా ఐటీ చట్టంలోని ఎథిక్స్ కోడ్ గైడ్ లైన్స్ ప్రకారం ఎమర్జెన్సీ అధికారాలను వినియోగించుకుని ఆ సంస్థలపై వేటేసింది. భారత సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను దెబ్బతీసే విధంగా విషం కక్కుతున్న 20 యూ ట్యూబ్ ఛానెళ్లు, రెండు వెబ్ సైట్లను మూసేయాలంటూ యూట్యూబ్ డిపార్టుమెంట్ కు లేఖ రాసింది.

పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఆ మీడియా సంస్థలు భారత్ పై దుష్ప్రచారానికి పాల్పడుతున్నాయి. నయా పాకిస్థాన్ అనే యూట్యూబ్ ఛానెల్ కశ్మీర్ పైనా, రైతు ఆందోళనల పైనా, అయోధ్యపైనా అసత్య కథనాలను ప్రసారంచేస్తోంది. ఈ ఛానెల్ కు దాదాపు 20 లక్షల మంది వ్యూయర్స్ కూడా ఉన్నారు.

Tags:    

Similar News