India, Bangladesh rail connectivity: చైనాకు భార‌త్ షాక్‌.. బంగ్లాకు భార‌త్ రైళ్లు

India, Bangladesh rail connectivity: సరిహద్దులో ఘర్షణలు జ‌రుగుతున్న వేళ చైనాకు భారత్ షాక్ ఇచ్చింది. పొరుగు దేశాలతో సంబంధాల బలోపేతం కోసం మోడీ స‌ర్కార్ కీలక అడుగులు వేస్తోంది.

Update: 2020-07-27 03:32 GMT
India, Bangladesh rail connectivity

India, Bangladesh rail connectivity: సరిహద్దులో ఘర్షణలు జ‌రుగుతున్న వేళ చైనాకు భారత్ షాక్ ఇచ్చింది. పొరుగు దేశాలతో సంబంధాల బలోపేతం కోసం మోడీ స‌ర్కార్ కీలక అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లోభార‌త్‌ కీలక ప్రాజెక్టులు చేపట్టనుంది. ఇప్పటికే బంగ్లాలో మొత్తం 17 రైల్వే ప్రాజెక్టులను నిర్మిస్తామ‌ని మోడీ ప్ర‌భుత్వం హామీ ఇచ్చింది.ఈ ఒప్పందాల్లో భాగంగా ఈరోజు బంగ్లాదేశ్ కు 10 అత్యాధునిక బ్రాడ్ గేజ్ లోకోమోటివ్ రైళ్లను అందజేస్తోంది. ఇండియా, బంగ్లాదేశ్ మధ్య కనెక్టివిటీ పెంచేందుకు ఈ రైళ్లు ఉపయోగపడతాయి. ఈ కార్యక్రమంలో భారత్ తరఫున విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్, రైల్వే మంత్రి పీయూష్ గోయల్,బంగ్లాదేశ్ తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్దుల్ కలాం అబ్దుల్ మోమెన్, రైల్వే మంత్రి నూరుల్ ఇస్లాం సుజన్ పాల్గొననున్నారు.

చైనా రైల్వే కనెక్టివిటీ ద్వారా బంగ్లాదేశ్‌లో ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు వేగవంతం చేయాలని చూస్తున్న వేళ భారత్.. కీలక నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. అయితే.. బంగ్లాదేశ్‌లో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం గురించి 2019లో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీ పర్యటన సందర్భంగా హామీ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కనెక్టివిటీ నిర్మాణం కోసం మొత్తం 2.44 మిలియన్ డాలర్ల నిధులు అవసరం అంచనా. ఈ నిధులను ఇండియా భరిస్తోంది. అయితే, ఈ నిధులను బంగ్లాదేశ్ పదేళ్లలో చెల్లించాలి. అంతేకాదు, ఐదేళ్లపాటు ఈ నిధులపై మారటోరియం కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ రైల్వే ప్రాజెక్టుల ద్వారా బంగ్లాదేశ్‌తో వాణిజ్య కార్యకలాపాలు గణనీయంగా పెరుగుతాయని.. తద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు కూడా మెరుగవుతాయని భారత్ భావిస్తోంది

ఇప్పటికే ఢిల్లీ-ఢాకా బస్సు సర్వీసులు, కోల్‌కతాకు బంగ్లాదేశ్ నుంచి మైత్రి రైలు ఎక్స్‌ప్రెస్‌ సేవలతో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇకపై సరిహద్దు వెంట వీలైన చోట్ల మరిన్ని ప్రాంతాల్లో రైల్వే కనెక్టివిటీ కోసం మోడీ స‌ర్కారు కృషి చేస్తుంది. నేటి కార్యక్రమంలో ఇరుదేశాల మంత్రులు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నార‌ని స‌మాచారం. 

Tags:    

Similar News